Canara Bank: ఇటీవల బ్యాంకుల పనితీరు విషయంలో రిజర్వు బ్యాంక్ చాలా అప్రమత్తంగా ఉంటోంది. ఏ చిన్న తప్పును సైతం అస్సలు ఉపేక్షించటం లేదు. ఈ క్రమంలో దేశంలోని చిన్న కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి పెద్ద బ్యాంకుల వరకు అన్నింటిపై పెనాల్టీలు పడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆగ్రహానికి గురైంది. వడ్డీ రేట్లను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, అనర్హులకు పొదుపు ఖాతాలు తెరవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్‌పై రూ.2.92 కోట్ల జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. ఆర్బీఐ చేపట్టిన తనిఖీల్లో విషయాలు వెలుగులోకి రావటంతో తాజా చర్యలు వచ్చాయి.

బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, MSMEకి ఇచ్చే రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో విఫలమైందని పరిశీలనలో గుర్తించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన, పునరుద్ధరించబడిన ఫ్లోటింగ్ రేటు రూపాయి రుణాలపై వడ్డీని దాని మార్జినల్ కాస్ట్‌తో లింక్ చేయడంలో విఫలమైందని RBI కనుగొంది. దీనికి తోడు అనేక క్రెడిట్ కార్డ్ ఖాతాలలో నకిలీ మొబైల్ నంబర్‌లను నమోదు చేయటం, రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించబడిన డిపాజిట్లపై వడ్డీని చెల్లించడంలో విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
కస్టమర్ల నుంచి SMS అలర్ట్ ఛార్జీలను బ్యాంక్ అసలు వినియోగ ప్రాతిపదికన రికవరీ చేసిందని, కస్టమర్ ప్రొఫైల్‌కు విరుద్ధంగా లావాదేవీలు జరిగినప్పుడు అలర్ట్‌లను రూపొందించడానికి కొనసాగుతున్న కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను ఉపయోగించడంలో విఫలమైనట్లు RBI తెలిపింది. ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపవలసిందిగా సూచించడానికి బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications