RBI: ఆదాయ గుర్తింపు సహా రెగ్యులేటరీ కంప్లయన్స్‌లో ఇతర లోపాల కారణంగా ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)పై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝళిపించింది. 2.20 కోట్ల వరకు జరిమానా విధించింది. ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ మరియు అడ్వాన్సులకు సంబంధించిన ప్రొవిజనింగ్, NPA ఖాతాలలో తేడా, డిపాజిట్‌ల వడ్డీ రేటుపై RBI జారీ చేసిన కొన్ని ఆదేశాల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది.
రెగ్యులేటరీ కంప్లయన్స్ ఉల్లంఘనల రీత్యా మాత్రమే ఫైన్ విధించినట్లు RBI తెలిపింది. తన కస్టమర్లతో బ్యాంక్ కుదుర్చుకున్న ఏవైనా లావాదేవీలు లేదా ఒప్పందాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మార్చి 31, 2021 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితికి సంబంధించి జరిపిన
తనిఖీల ఆధారంగా జరిమానా వేసినట్లు పేర్కొంది.

2020-21 సంవత్సరానికి బ్యాంకు వెల్లడించిన లాభంలో 25 శాతానికి సమానమైన మొత్తాన్ని రిజర్వ్ ఫండ్ కు బదిలీ చేయడంలో విఫలమైంది. బ్యాంకు నివేదించిన, వాస్తవంగా బయటపడిన NPAల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్‌లకు వర్తించే వడ్డీ రేట్లను కొన్ని సందర్భాల్లో సాధారణ వ్యక్తులకూ అందించింది.

ATM టెర్మినల్/PC మరియు ATM స్విచ్ మధ్య కమ్యూనికేషన్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు సంబంధించిన నియంత్రణ చర్యలను బ్యాంకు పాటించలేదు. సూచించిన సమయపాలన అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో కారణం తెలపాలంటూ RBI రెండు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఉత్తర, ప్రత్యుత్తరాలు పరిశీలించిన తరువాత ఆరోపణలు రుజువు కావడంతో పెనాల్టీ విధించింది.


Click it and Unblock the Notifications