RBI News: ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వు బ్యాంక్ చిన్నపెద్ద అనే తేడా లేకుండా అన్ని బ్యాంకులపై కఠినంగానే వ్యవహరిస్తోంది. రూల్స్ పాటించకపోతే భారీ పెనాల్టీలతో చుక్కలు చూపిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్ మంగళవారం ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలకు షాక్ ఇచ్చింది. ముందుగా కోటక్ మహీంద్రా బ్యాంకుపై రూ.3.95 కోట్లు పెనాల్టీగా విధించింది. ఇదే సమయంలో మరో ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐపై అత్యధికంగా రూ.12.19 కోట్ల మెుత్తాన్ని పెనాల్టీ రూపంలో విధించినట్లు వెల్లడైంది. ఈ రెండు సంస్థలు కొన్ని నిబంధనలను పాటించటంలో విఫలమైనందున చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

కొన్ని కార్యాచరణ మార్గదర్శకాలను పాటించనందున కోటక్ మహీంద్రా బ్యాంక్, ICICI బ్యాంక్‌లపై జరిమానాలు విధించినట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. అలాగే కోటక్ బ్యాంక్ సర్వీస్ ప్రొవైడర్లతో వార్షిక రివ్యూ నిర్వహణ, కస్టమర్లను సంప్రదించటంలో సమయపాలన పాటించకపోవటం, అలాగే బ్యాంక్ అసలు పంపిణీ తేదీకి కాకుండా చెల్లింపు గడువు తేదీ నుండి వడ్డీని వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు జరిమానాను ఎదుర్కొంది. అలాగే లోన్ అగ్రిమెంట్లో వెల్లడించకుండా లోన్ ఫోర్ క్లోజర్ ఛార్జీలు వసూలు చేయటంపై కూడా జరిమానాను కోటక్ బ్యాంక్ ఎదుర్కొంది.
ఇక ఐసీఐసీఐ విషయానికి వస్తే.. ఐసీఐసీఐ డైరెక్టర్లు బోర్డు సభ్యులుగా ఉన్న కంపెనీలకు చట్ట విరుద్ధంగా రుణాలను అందించినందుకు, నాన్ ఫైనాన్స్ ఉత్పత్తుల మార్కెటింగ్, మోసాలను RBIకి నివేదించడంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినందుకు భారీ పెనాల్టీని ఎదుర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications