RBI News: యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్‌పై రిజర్వు బ్యాంక్ పెనాల్టీ..
RBI Penalty: దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని ముందుకు నడిపే సెంట్రల్ బ్యాంక్ చాలా కఠినంగా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో చిన్న తప్పులను సైతం అస్సలు ఉపేక్షించటం లేదు.
ఈ క్రమంలో తాజాగా ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నిబంధనలను పాయించనందుకు రూ.90.93 లక్షలు పెనాల్టీగా విధించింది. కేవైసీ, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకు రిజర్వు బ్యాంక్ పెనాల్టీ విధించినట్లు పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ఖాతాదారుల గుర్తింపు మరియు వారి చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో బ్యాంక్ విఫలమైందని RBI పేర్కొంది. అలాగే కస్టమర్లకు నిరంతరం కాల్స్ చేయటం, అపరాధ రుణగ్రహీతల్లో కొంతమందితో రికవరీ ఏజెంట్ల ప్రవర్తన సముచితంగా లేదని ఆర్బీఐ పేర్కొంది.

ఇదే క్రమంలో బంగారం తాకట్టుపై రుణాలను అందించే మణప్పురం ఫైనాన్స్ కంపెనీపై రిజర్వు బ్యాంక్ 43 లక్షలు పెనాల్టీగా విధించింది. రుణాలకు సంబంధిచిన నిబంధనలు, కేవైసీ నిబంధనలు పాటించనందుకు ఈ పెనాల్టీ వధించబడినట్లు తెలిసింది. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ రుణాలకు బలమైన డిమాండ్ కారణంగా రెండో త్రైమాసిక లాభంలో ఊహించిన దానికంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది.
రిజర్వు బ్యాంక్ అసురక్షిత వ్యక్తిగత రుణాలపై నిబంధనలను కఠినతరం చేసింది. రిస్క్ వెయిట్‌లు 25 శాతం పాయింట్లు పెంచింది. దీంతో అసురక్షిత వ్యక్తిగత రుణాలతో సహా వినియోగదారుల క్రెడిట్‌పై రిస్క్ బరువును 100% నుండి 125%కి పెరిగింది. ఈ నిబంధన బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్ మరియు నాన్-బ్యాంకు ఫైనాన్స్ కంపెనీలకు బ్యాంకు రుణాలపై రిస్క్ వెయిటేజ్ కూడా పెంచింది. హౌసింగ్, విద్య, వాహన రుణాలు, బంగారు రుణాలపై ఈ రూల్స్ వర్తించవని పేర్కొంది.


Click it and Unblock the Notifications