RBI On Kotak Bank: ఇటీవల దేశంలో రిజర్వు బ్యాంక్ అనేక బ్యాంకులపై నిబంధనలు పాటించనందుకు కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ సైతం వచ్చి చేరిపోయింది.
వివరాల్లోకి వెళితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 24న కోటక్ మహీంద్రా బ్యాంక్‌ని ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ల ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పర్యవేక్షక ఆందోళనలను ఉటంకిస్తూ తాజా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా నిషేధించింది. మార్కెట్ ముగింపు సమయం తర్వాత ప్రకటన రావటంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. రేపు మార్కెట్లు ప్రారంభం కాగానే కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లతో సహా ప్రస్తుత కస్టమర్లకు సేవలను అందించడం కొనసాగిస్తుందని రిజర్వు బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ 2022, 2023 సంవత్సరాల్లో బ్యాంక్ IT పరీక్షల నుంచి ఉత్పన్నమయ్యే ముఖ్యమైన ఆందోళనల ఆధారంగా ఈ సమస్యలను సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో నిరంతర వైఫల్యం ఆధారంగా తాజా చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
సెంట్రల్ బ్యాంక్ ప్రకారం IT ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ప్యాచ్ & చేంజ్ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ కఠినత వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నాన్-కాంప్లియెన్సులు ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ గమనించింది. RBI రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ కింద ఉన్న అవసరాలకు విరుద్ధంగా, బ్యాంకు తన ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్‌లో లోపభూయిష్టంగా ఉన్నట్లు వరుసగా రెండు సంవత్సరాలుగా అంచనా వేయబడింది.
బ్యాంక్ అందించిన వివరాలు నిలకడగా లేనట్లు సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. అలాగే 2022, 2023 సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళికలకు బ్యాంక్ అనుగుణంగా లేదని తాము కనుగొన్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బలమైన IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, IT రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ లేకపోవడంతో బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(CBS), ఆన్‌లైన్ & డిజిటల్ బ్యాంకింగ్ ఛానెల్‌లు గత రెండేళ్లలో తరచుగా అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఏప్రిల్ 15, 2024న వినియోగదారులకు తీవ్రమైన అసౌకర్యం కలిగినట్లు రిజర్వు బ్యాంక్ పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications