భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వద్ద ప్రస్తుతం ఉన్న బంగారం నిల్వలను FY26లో ఇప్పటివరకు పెంచలేదు.ఈ ఏడాదిలో ఎటువంటి కొనుగోళ్లు జరపలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. బంగారం ధరలు ముందు ముందు తగ్గే అవకాశం ఉన్నందున ఆర్బీఐ ఈ స్థిర వైఖరిని అనుసరించినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధరలు 80 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పాటుగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు విధించబడే ప్రమాదం వంటి అంశాలు బంగారాన్ని పెట్టుబడిదారులకు అత్యంత భద్రమైన పెట్టుబడిగా మార్చాయి.
అయితే తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం చూస్తే.. మార్చి చివరి వరకు ఉన్న 880 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు మే నెల చివరివరకు ఆర్బీఐ వద్ద అలాగే స్థిరంగా ఉన్నాయి. వాటిల్లో ఎటువంటి పెరుగుదల చోటు చేసుకోలేదు. ఇక గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ 2023లో కూడా ఆర్బీఐ బంగారం కొనుగోళ్లను నిలిపివేసిన సంగతి విదితమే.

అప్పుడు కూడా బంగారం నిల్వలు 804 మెట్రిక్ టన్నుల వద్ద అలాగే ఉన్నాయి.ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనడం వెనుక మార్కెట్ అంచనాల ప్రభావం ఉన్నట్లుగా పలువరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
పలు ప్రముఖ సంస్థలైన సిటీ, ఫిచ్ రిసర్చ్ డివిజన్, మోతీలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ బ్యాంక్‌లు అందించిన తాజా నివేదికల ప్రకారం.. బంగారం ధరలు ప్రస్తుత స్థాయి 3,445 డాలర్ ట్రాయ్ ఔన్స్ నుండి దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్న సూచనలు పసిడి ధరలను తగ్గించేందుకు మార్గం సుగుమం చేస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని అత్యంత భద్రమైన పెట్టుబడి ఎంపికగా భావిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు వచ్చే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచనున్నట్లు 95 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం ఇది 81శాతం మాత్రమే ఉండేది.బంగారాన్ని తమ పోర్ట్‌ఫోలియోలో విభజన కోసం, విలువను నిలుపుకునే సాధనంతో పాటుగా ఆర్థిక సంక్షోభాల్లో రక్షణగా కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.
ఆర్బీఐ తాజా వార్షిక నివేదిక ప్రకారం..దేశపు నికర విదేశీ ఆస్తుల్లో బంగారానికి ఉన్న వాటా మార్చి 2025 నాటికి 12 శాతానికి పెరిగింది. గత సంవత్సరం ఇది 8.3 శాతంమాత్రమే ఉండేది. భారత కేంద్ర బ్యాంకు తన ఆస్తులను తక్షణ అవసరాలకు లిక్విడిటీ ట్రాంచ్, రాబడి పెంచే ఇన్వెస్ట్‌మెంట్ ట్రాంచ్‌లుగా విభజించుకుంటుంది. ఏదేమైనా..ప్రస్తుతం బంగారం ధరల తాత్కాలిక పెరుగుదల నేపథ్యంలో, ఆర్బీఐ కొనుగోళ్లకు తాత్కాలిక విరామం ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలికంగా బంగారం ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications