కొత్త ఇళ్లు కొనేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. హోమ్ లోన్స్‌పై కీలక ప్రకటన
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 4 శాతం రెపో రేటు యథాతథంగా కొనసాగనుంది. అటు రివర్స్ రేపో రేటును కూడా గతంలో ఉన్న 3.35 శాతం వద్ద ఉంచారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.కొత్తగా ఇళ్లు కొని హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పారు. లోన్ టు వ్యాల్యూ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
2023 మార్చి 31 కొత్త ఇంటిని కొనుగోలు చేసేవారికి లోన్ టు వ్యాల్యూకి లింక్ చేస్తామని శక్తికాంత దాస్ వివరించారు. ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా స్థిరంగా ఉంచింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ గడువును పెంచడం వల్ల బ్యాంకులు కూడా మరిన్ని గృహ రుణాలు ఇచ్చేందుకు అస్కారం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆ లోన్ సైజ్, లోన్ టూ వ్యాల్యూ రేషియోను బట్టి రిస్క్ వెయిట్ ఉండనుందని చెప్పారు. ఆర్థిక పునరుద్ధరణలో భాగంగా రియల్ ఎస్టేట్ రంగం పాత్రను గుర్తించి దానికి ఊతం ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోవడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉండనున్నాయి. అటు బ్యాంకులు కూడా ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లకే ఇంటికి రుణాలను అందిస్తున్నాయి. గతంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 9 నుంచి 10 శాతం మేర ఉండేవి. కరోనా మహామ్మారితో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిండంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా భారీగానే తగ్గాయి. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు పోటీపడి మరీ తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. ఆయా బ్యాంకులు 7 శాతం వడ్డీరేటు లోపే ఇంటికి రుణాలు మంజూరు చేస్తున్నాయి. సొంత ఇంటి కలను నిజం చేసుకునేవారికి ఇది మంచి అవకాశం. ఇంటిని కొనుగోలు చేసేవారికి, నిర్మించుకునేవారికి బ్యాంకులు 6.55 శాతం వడ్డీ రేటుకు కూడా హోమ్ లోన్స్ అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications