ముంబై: ప్రైవేట్ సెక్టార్‌లో లీడ్ బ్యాంక్‌గా గుర్తింపు పొందిన హెచ్‌డీఎఫ్‌సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. డిజిటల్ వ్యాపార లావాదేవీలపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ మేరకు రిజర్వ్‌బ్యాంక్ నుంచి తమకు లిఖిపూరక అనుమతులు లభించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. డిజిటల్ 2.O కింద తాము ప్రతిపాదించిన లావాదేవీలపై విధించిన నిషేధాన్ని ఆర్బీఐ ఎత్తివేసిందని, త్వరలోనే ఈ సేవలను తాము పునఃప్రారంభిస్తామని పేర్కొంది.
చాలాకాలం నుంచే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ సర్వీసులు ఖాతాదారులకు అందుబాటులో ఉంటోన్నాయి. డిజిటల్ 2.O పేరుతో దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటా సెంటర్‌లో పదేపదే పొరపాట్లు, సాంకేతిక లోపాలు తలెత్తడంతో రిజర్వ్‌బ్యాంక్ 2020 డిసెంబర్‌లో నిషేధం విధించింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీతో పాటు డిజిటల్ 2.O ప్రోగ్రామ్ కింద ఎలాంటి లావాదేవీలను నిర్వహించకూడదని అప్పట్లో ఆదేశించింది.

డేటా సెంటర్ స్తంభించిపోవడానికి, ఇందులో చోటు చేసుకునే పొరపాట్లకు ఎవరు జవాబుదారి వహిస్తారనేది తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. దీనికి ఎప్పటికప్పుడు కారణాలను వెల్లడించాలని సూచించింది. గత సంవత్సరం ఆగస్టులో ఈ నిషేధాలను స్వల్పంగా సవరించింది రిజర్వుబ్యాంక్. కొంతమేర సరళీకరించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మొత్తంగా వాటిని ఎత్తేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. నిషేధ కాలంలో డేటా సెంటర్ పనితీరును మెరుగుపరిచామని పేర్కొంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications