RBI: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ జరిమానా..
మోసాలు, రిపోర్టింగ్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బ్యాంకు)పై ₹84.50 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బిఐ శుక్రవారం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ మార్చి 31, 2021 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి తనిఖీ నిర్వహించింది. జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జెఎల్‌ఎఫ్) ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలని నిర్ణయించిన ఏడు రోజులలోపు ప్రభుత్వ రంగ రుణదాత ఆర్‌బిఐకి కొన్ని ఖాతాలను మోసం చేసినట్లు నివేదించడంలో విఫలమైనట్లు తనఖీలో వెల్లడైంది.
ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని బ్యాంకుకు ఆర్‌బిఐ నోటీసు జారీ చేసింది. నోటీస్‌కు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జరిమానా విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

జూన్ 21న ఖాళీగా ఉన్న RBI డిప్యూటీ గవర్నర్ పదవికి జూన్ 1న షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ప్యానెల్ ఇంటర్వ్యూ చేయనుంది. ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ పదవికి సంబంధించిన ఈ ఖాళీని వాణిజ్య బ్యాంకర్ కోసం రిజర్వ్ చేశారు. ఐదుగురు అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక PSB నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఉన్నారు.
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థి వివరాలను PM నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీకి పంపిస్తారు. RBIకి ప్రస్తుతం నలుగురు డిప్యూటీ గవర్నర్లుగా MK జైన్, మైఖేల్ పాత్ర, M రాజేశ్వర్ రావు, T రబీ శంకర్ ఉన్నారు. జైన్ పదవీ కాలంలో జూన్ 21న ఖాలీ కానుంది.


Click it and Unblock the Notifications