RBI: ప్రేవేట్ బ్యాంకుల బోర్డుల్లోని ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం నిర్వహించారు. పలు విషయాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. కొన్ని సునిశిత వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల బ్యాంకింగ్ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, పలు హెచ్చరికలు జారీ చేశారు.
ఆయా బ్యాంకుల వద్ద కార్పొరేట్ గవర్నెన్స్ లో లోపాలు కనిపించాయని RBI గవర్నర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం పట్ల కఠినంగా వ్యవహరించాలని, NPAలను దాచేందుకు ప్రయత్నించవద్దని ప్రైవేట్ బ్యాంకుల ఉన్నతాధికారులు, డైరెక్టర్లను హెచ్చరించారు. ఇందుకు సంబంధించి శక్తికాంత దాస్ చేసిన ప్రసంగం RBI అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయబడింది.

"కార్పోరేట్ గవర్నెన్స్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో కొంత అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకుల పాలనలో మేము అంతరాలను గుర్తించాము. ఇది ఆందోళన కలిగించే విషయం" అని RBI గవర్నర్ తెలిపారు. ఒత్తిడికి గురైన ఖాతాల వాస్తవ స్థితిని బ్యాంకులు దాచిపెట్టే వినూత్న మార్గాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ప్రశ్నించారు.
రుణాల బైబ్యాక్ ద్వారా ఇద్దరు రుణదాతలను ఒకరికొకరు ఎవర్ గ్రీన్‌గా మార్చడం, ఒత్తిడికి గురైన రుణగ్రహీతతో నిర్మాణాత్మక ఒప్పందాలను కుదర్చడం, రుణగ్రహీత తిరిగి చెల్లింపును సర్దుబాటు చేయడానికి అంతర్గత ఖాతాలను ఉపయోగించడం, ఒత్తిడిలో ఉన్న రుణగ్రహీతకు మునుపటి రుణాల చెల్లింపు తేదీకి దగ్గరవుతుండగా కొత్త/అదనపు రుణాల పంపిణీ వంటి చర్యలు సబబు కాదని శక్తికాంత దాస్ హెచ్చరించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications