personal loans: బ్యాంకులు, NBFCలకు RBI గవర్నర్ హెచ్చరిక.. కఠినం కానున్న పర్సనల్ లోన్ రూల్స్
personal loans: ఆయా బ్యాంకులు ఇస్తున్న వ్యక్తిగత రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని మానిటర్ చేసేందుకు అంతర్గత నిఘా యంత్రాంగాన్ని పటిష్ఠం చేసుకోవాలని సూచించింది.
అన్ సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు RBI తెలిపింది. తమ మార్జిన్ లు పెంచుకునేందుకు ఆయా బ్యాంకులు, NBFCలు ఈ తరహా మార్గాలవైపు భారీగా దృష్టిసారిస్తున్నట్లు గుర్తించింది. అయితే స్వంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు తగిన రక్షణాత్మక విధానాలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక సంస్థలను ఆదేశించింది.

రుణదాతలు పటిష్ఠమైన రిస్క్ మేనేజ్ మెంట్, బలమైన పూచీకత్తు ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని RBI గవర్నర్ సూచించారు. తద్వారా ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ, వ్యక్తిగత రుణాల పెరుగుదల వల్ల భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ దెబ్బతో బ్యాంకులు పర్సనల్ లోన్ రూల్స్ ను కఠినతరం చేస్తాయని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.
'ఏడాది ప్రాతిపదికన చూస్తే చాలా బ్యాంకుల రిటైల్ క్రెడిట్ 30 శాతం, అసురక్షిత క్రెడిట్ 23 శాతం పెరిగింది. అయితే ఇతర విభాగాలు 12-14 శాతంతో వృద్ధి చెందుతున్నాయి. మిగతావాటితో పోలిస్తే రిటైల్ క్రెడిట్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. అందుకే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని RBI డిప్యూటీ గవర్నర్ జె స్వామినాథన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం బ్యాంకింగ్ విభాగంలోని మొత్తం రుణాలలో రిటైల్ రుణాలు మూడింట ఒక వంతు ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్స్ 10-15 శాతంగా ఉన్నాయి. 'ఇటీవల కాలంలో రిటైల్ రుణాలు క్రెడిట్ వృద్ధికి దోహదపడుతున్నాయి అసెట్ క్వాలిటీ చాలా వరకు పెరిగింది మరియు రికవరీలు కూడా బలంగా ఉన్నాయి' అని ICRA వైస్ ప్రెసిడెంట్ ఆశయ్ చోక్సే తెలిపారు.


Click it and Unblock the Notifications