Shaktikanta Das: ప్రపంచ గుర్తింపు పొందిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రధాని కితాబు..
RBI News: ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ, అధిక జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థకు గుండె సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ. అయితే దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న వ్యక్తి గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థను ముందుకు గడితప్పకుండా నడిపించటంలో దాస్ అత్యున్నత పనితీరుకు ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది.
ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వరుసగా 2వ సంవత్సరం అన్ని గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లలో "A+" రేటింగ్ అందుకుని చరిత్ర సృష్టించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గవర్నర్‌ను కొనియాడారు. ఈ రేటింగ్ అతని నాయకత్వానికి గుర్తింపని అన్నారు. US ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంకింగ్ పరిశీలిస్తే.. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ కెట్టెల్ థామ్‌సెన్, స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్‌లు "A+" రేటింగ్‌ను అందుకున్న ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లుగా నిలిచారు.

ఇదే క్రమంలో బ్రెజిల్‌కు చెందిన రాబర్టో కాంపోస్ నెటో, చిలీకి చెందిన రోసన్నా కోస్టా, మౌరిషస్ నుంచి హర్వే కుమార్ సీగోలం, మొరాకోకు చెందిన అబ్దెల్లతీఫ్ జౌహ్రీ, దక్షిణాఫ్రికాకు చెందిన లెసెట్జా క్గాన్యాగో, శ్రీలంకకు చెందిన నందలాల్ వీరసింగ్, వియత్నాంకు చెందిన న్గుయెన్ థీ హాంగ్ "A" రేటింగ్‌ను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి అందుకున్న వారిలో నిలిచారు.
ఇదే క్రమంలో కంబోడియాకు చెందిన చీ సెరీ, కెనడాకు చెందిన టిఫ్ మాక్లెమ్, కోస్టారికాకు చెందిన రోజర్ మాడ్రిగల్ లోపెజ్, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన హెక్టర్ వాల్డెజ్ అల్బిజు, యూరోపియన్ యూనియన్‌కు చెందిన క్రిస్టీన్ లగార్డే, గ్వాటెమాలాకు చెందిన అల్వారో గొంజాలెజ్ రిక్కీ, ఇండోనేషియాకు చెందిన పెర్రీ వార్జియో, జమైకాస్, జమైకాస్ అడ్రాన్ ల్ఖాగ్వాసురెన్, నార్వే నుంచి ఇడా వోల్డెన్ బాచే, పెరూకు చెందిన జూలియో వెలార్డ్ ఫ్లోర్స్, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎలి రెమోలోనా, స్వీడన్‌కు చెందిన ఎరిక్ థెడెన్, అమెరికాకు చెందిన జెరోమ్ హేడెన్ పావెల్ మాత్రం "A-" రేటింగ్‌ను అందుకున్న సెంట్రల్ బ్యాంకర్లుగా నిలిచారు.
ర్యాంకింగ్ ఇచ్చిన తీరును పరిశీలిస్తే.. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేటు నిర్వహణ వంటి అంశాల్లో సెంట్రల్ బ్యాంకర్ల పనితీరును పరిశీలించి తదనుగుణంగా "A+" నుంచి "F" వరకు ర్యాంకింగ్‌లను మ్యాగజైన్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ బ్యాంకర్లు గడచిన కొన్నేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల పెంపు చర్యల సత్ఫలితాలను ప్రస్తుతం చూస్తున్నారని గ్లోబల్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, సంపాదకీయ డైరెక్టర్ జోసెఫ్ గియారాపుటో చెప్పారు.


Click it and Unblock the Notifications