రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ క్రిప్టో కరెన్సీ పైన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలకు ఇది ముప్పని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీలకు నియంత్రిత వ్యవస్థ ఏర్పాటు చేసేవరకు ఇవి దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాల్ విసురుతాయన్నారు. మన దేశంలో క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల సంఖ్య, మార్కెట్ వ్యాల్యూ పైన ఆయన సందేహం వ్యక్తం చేశారు. వర్చువల్ కరెన్సీపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని, అయితే కేంద్ర బ్యాంకర్‌గా క్రిప్టోపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. భారత్‌లో 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీని కలిగి ఉన్నారని ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్ల పెరగడంపై ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ చట్టం...
కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ చట్టాన్ని రూపొందించలేదు. ఇందుకు సంబంధించి పరిశ్రమ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. పలుమార్లు చర్చల అనంతరం ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పైన పరిమితులను విధించవచ్చునని భావిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలలో బిట్ కాయిన్, ఎథేరియం మంగళవారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అయితే ఇటీవల స్వల్పంగా క్షీణించాయి. ఈ రెండు వర్చువల్ కరెన్సీలు కూడా జూన్ నెల ధరతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్ నెలలోనే 70 శాతం లాభపడింది. 2020క్యాలెండర్ ఏడాదిలో బిట్ కాయిన్ 131 శాతం లాభపడింది.

కేంద్రం సెస్ తగ్గింపుపై...
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన సెస్ తగ్గించడంపై శక్తికాంత దాస్ స్పందించారు. ఇది పాజిటివ్ డెవలప్‌మెంట్ అన్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్భణం టార్గెట్ 5.3 శాతానికి చేరుకోవడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. అలాగే, వృద్ధి రేటు 9.5 శాతంగా అంచనా వేస్తున్నామని, దీనిని అందుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. ఇప్పటికే మనీ మార్కెట్‌లో లిక్విడిటీ రీబ్యాలెన్స్ చోటు చేసుకుందన్నారు. ఎనర్జీ, స్టీల్, కమోడిటీస్ ధరలు పెరిగాయని, కానీ ప్రస్తుతం అవి పీక్ స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారన్నారు.

జీడీపీ వృద్ధి రేటు
భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆర్థిక రికవరీ వేగవంతమైందని చెప్పారు. ఆర్థిక, పన్నుల సంస్కరణలు ముఖ్యంగా వృద్ధికి ఉపయోగపడ్డాయని, విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.


Click it and Unblock the Notifications