RBI News: గ్రామీణ ప్రజల కోసం ఆర్బీఐ కొత్త చర్య.. ఇక తక్కువ వడ్డీకే వేగంగా లోన్స్..!!
Unified Lending Interface: భారతీయ చెల్లింపుల్లో డిజిటల్ రెవల్యూషన్ తీసుకొచ్చిన యూపీఐ మాదిరిగానే రుణాలను పొందటం కోసం మరో కొత్త టెక్నాలజీని ప్రజలకు చేరువచేయాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తోంది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్(ULI) అనే సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌ను ప్రవేశపెట్టింది.
యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ ప్రధానంగా దేశంలోని గ్రామీణ, చిన్న రుణగ్రహీతలకు క్రెడిట్ పంపిణీని వేగవంతం చేసేందుకు ఇది దోహదపడుతుందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వ్యవసాయం మరియు MSME రుణగ్రహీతలకు వివిధ రంగాల్లో రుణాలకు ఉన్న పెద్ద డిమాండ్‌ను ULI తీర్చగలదని అన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ బహుళ డేటా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి రుణదాతల వరకు వివిధ రాష్ట్రాల భూ రికార్డులతో సహా డిజిటల్ సమాచార ప్రవాహాన్ని సులభతరం చేస్తుందన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు దాస్ తెలిపారు.

క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేయడానికి ఆర్‌బిఐ గత సంవత్సరం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ రూపంలో పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది కేవలం కొన్ని నిమిషాల్లో క్రెడిట్ లేదా లోన్‌లను సులభతరం చేయడానికి రుణదాతలకు డిజిటల్ సమాచారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను మార్చినట్లే.. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ULI కూడా లెండింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మారుస్తుందని శక్తికాంత దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
బెంగళూరులో జరిగిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గవర్నర్ సెంట్రల్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలను డిజిటలైజేషన్ చేయడంలో ఇది భాగమని చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ క్రమంగా విడుదల చేయబడుతున్నాయి. ఇది భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణంలో ఒక విప్లవాత్మక అడుగని పేర్కొన్నారు. కొత్తగా తీసుకొస్తున్న సాంకేతికత రుణగ్రహీతలు విస్తృతమైన డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే సజావుగా క్రెడిట్ డెలివరీ, వేగవంతమైన టర్నరౌండ్ సమయాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications