తాజాగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎసిడిటీ సంబంధిత కారణంగా చేరిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మంగళవారం డిశ్చార్జ్ అయినా సంగతి మీకు తెలిసిందే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీకాలం వచ్చే నెల డిసెంబర్‌తో ముగియనుంది. కానీ శక్తికాంత దాస్ ఆర్బిఐ గవర్నర్‌గా మరోసారి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే అతను మరోసారి మూడేళ్ల పదవీకాలం పాటు కొనసాగుతాడా లేదా అనేది స్పష్టంగా లేదు. ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 12తో ముగియడంతో ఆయన మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని అంచనా వేస్తున్నారు. శక్తికాంత దాస్‌కు గవర్నరుగా మూడోసారి అవకాశం గురించి చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది.

ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను తిరిగి నియమించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఒక సిఫార్సును అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ (ఏసీసీ)కి అందజేయడం జరిగింది. ఈ విషయంపై త్వరలో ఫైనల్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అని తెలిపారు.
నివేదికల ప్రకారం మహారాష్ట్ర & జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల కారణంగా శక్తికాంత దాస్‌ను ఆర్‌బిఐ గవర్నర్‌గా తిరిగి నియమించడంలో ఆలస్యం జరిగి ఉండవచ్చు. మరో వారం రోజుల్లోగా ఆయన నియామకంపై చివరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో కేబినెట్ నియామకాల కమిటీ (ACC)కి RBI గవర్నర్ని నియమించే బాధ్యత ఉంటుంది. శక్తికాంత దాస్ మళ్లీ నియమితులైతే తన పదవీకాలాన్ని రెండుసార్లు పొడిగించిన రెండవ RBI గవర్నర్ అవుతారు. అలాగే అతని పదవీకాలాన్ని ఏడాదికి మించి పొడిగిస్తే అతను ఎక్కువ కాలం పనిచేసిన RBI గవర్నర్ల ర్యాంక్‌లో చేరతారు.
12 డిసెంబర్ 2018న ఉర్జిత్ పటేల్ తర్వాత గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ మూడేళ్లు పూర్తయిన తర్వాత 2021 డిసెంబర్‌లో రెండవసారి తిరిగి గవర్నర్‌గా నియమితులయ్యారు. 2024లో వరుసగా రెండవ సంవత్సరం, గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా దాస్ ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా పేరుపొందారు. క్లిష్టమైన ఆర్థిక సమయాల్లో RBIకి మార్గనిర్దేశం చేయడంలో అతని లీడర్షిప్కి A+ రేటింగ్ కూడా అందుకున్నారు.


Click it and Unblock the Notifications