UPI News: కొత్తగా యూపీఐలో 2 ఫీచర్లు.. సూపర్ ప్రయోజనాలు బాస్.. వాడేసుకోండి..
UPI New Features: దేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ రావటంతో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. ఈ రంగంలో గడచిన దశాబ్ధ కాలంగా అద్భుతమైన పురోగతి కొనసాగుతోంది. ఉచిత సేవల కారణంగా ప్రజలు సైతం దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే యూపీఐలో మరో 2 కొత్త ఫీచర్లను రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం ప్రకటించారు. దీని ద్వారా ట్రాన్సాక్షన్లను మరింతగా సులభతరం చేయటంతో పాటు క్యాష్ డిపాజిట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాస్ ప్రకటించారు. మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించిన సమయంలో ఈ ప్రకటన చేశారు.

యూపీఐ చెల్లింపులను వినియోగించే వ్యక్తులు ఇప్పుడు ఏదైనా థర్డ్-పార్టీ యాప్‌ని ఉపయోగించి UPI ద్వారా చెల్లింపులు చేయడానికి డిజిటల్ వాలెట్‌ల వంటి PPIలను ఉపయోగించుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది.
ఈ కొత్త ఆదేశం PPI వాలెట్ హోల్డర్‌లను (ఫోన్‌పే, ఫ్రీఛార్జ్ మొదలైనవి) లావాదేవీల కోసం థర్డ్-పార్టీ UPI యాప్‌లతో తమ వాలెట్‌లను లింక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ అభివృద్ధి ఫలితంగా PPI వాలెట్‌ల మధ్య ఇంటర్‌ఆపరేబిలిటీ పెరుగుతుందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిన్‌టెక్ నిపుణులు ఈ పురోగతి బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేసే ప్రక్రియతో సమానంగా PPIలను తీసుకువస్తుందని భావిస్తున్నారు.

ఇదే క్రమంలో క్యాష్ డిపాజిట్ మెషీన్‌ల ద్వారా నగదు జమ చేయడం ప్రధానంగా డెబిట్ కార్డ్‌ల వాడకం ద్వారా జరుగుతుంది. అయితే ATMలలో UPIని ఉపయోగించి కార్డ్-లెస్ నగదు ఉపసంహరణ నుంచి పొందిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, UPIని ఉపయోగించి CDMలలో నగదును డిపాజిట్ చేయడానికి ఇకపై వెసులుబాటు కలగనుంది. తాజా చర్య చర్య కస్టమర్ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచటంతో పాటు బ్యాంకుల వద్ద కరెన్సీ నిర్వహణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయనుంది. దీంతో త్వరలో UPI యాప్ ద్వారా ఖాతాదారులు బ్యాంకులు, ATMలలో నగదు డిపాజిట్ మెషీన్‌ల(CDMలు) వద్ద నగదును డిపాజిట్ చేయగలుగుతారు.


Click it and Unblock the Notifications