రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు. రెపో రేటును యథాతథంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి. అందురు ఊహించినట్లు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి 6 నుంచి సమావేశాలు నిర్వహించింది.
ఈ సమావేశాలు ఫిబ్రవరి 8న ముగిసాయి. సమావేశ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాకు వివరించారు. చివరిగా రెపో రేటును ఫిబ్రవరి 2023లో పెంచారు. 6.25 నుంచి 6.5 శాతానికి పెంచారు. "సకాలంలో, స్థిరమైన పద్ధతిలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించాలనే మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము" అని ఆర్‌బిఐ గవర్నర్ చెప్పారు.

రెపో రేటు అనేది బ్యాంకులకు ఆర్‌బిఐ స్వల్పకాలిక నిధులను ఇచ్చే రేటు. దీనిపై ఆర్బీఐ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉన్నందున MPC రేటు నిర్ణయంలో ఆశ్చర్యం లేదని శక్తికాంత్ దాస్ అన్నారు. భారతదేశ ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో నాలుగు నెలల గరిష్ట స్థాయి 5.69 శాతానికి చేరుకుందని చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా, రేటు తగ్గింపు తక్షణ పరిశీలనలో లేదని తెలిపారు. "ఈ సమయంలో, రేటు తగ్గింపు అంశం మా టేబుల్‌పై లేదు, అది చర్చలో కూడా లేదు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకురావడానికి, ద్రవ్యోల్బణాన్ని చురుకుగా కొనసాగించడమే మా దృష్టి అని గవర్నర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications