RBI MPC Meeting: రేపో రేటు కట్ చేసిన ఆర్బీఐ గవర్నర్.. ఐదేళ్లలో మొదటిసారి.. హోమ్ లోన్స్ మొదలైన వాటికి రిలీఫ్..
RBI Repo Rate: భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. దింతో మొత్తంగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి 6.25 శాతానికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం చివరి రోజున కీలక వడ్డీ రేట్లపై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
బడ్జెట్ 2025లో పెద్ద పన్ను రాయితీల తర్వాత సామాన్యులకు మరో శుభవార్త అందింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25%కి ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఫిబ్రవరి 2023 తర్వాత మొదటి రెపో రేటు తగ్గింపు ఇదే. మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ హయాంలో వరుసగా 11 పాలసీలకు రేట్లు యధావిధిగా కోనసాగించాయి. తాజా రేపో రేటు తగ్గింపు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, కారు రుణాలు సహా ఇతర రుణగ్రహీతలకు గొప్ప శుభవార్తను ఇచ్చింది.

స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం (SDF) రేటును 6 శాతానికి తగ్గించారు. అయితే మార్జినల్ స్టాండింగ్ సౌకర్యం (MSF) రేటు అండ్ బ్యాంక్ రేటును 6.50 శాతానికి తగ్గించారు. వృద్ధికి మద్దతు ఇస్తూనే, +/- 2 శాతం బ్యాండ్‌లో 4 శాతం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్రవ్యోల్బణం మధ్యకాలిక లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యంతో MPC ఫలితాలు అనుగుణంగా ఉన్నాయి.
మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నుండి బాధ్యతలు స్వీకరించి కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఫిబ్రవరి 2025 ఎంపీసీ సమావేశం మొదటిది. ఫిబ్రవరి 5 నుండి ఆరుగురు సభ్యుల MPC మూడు రోజుల సమావేశానికి మల్హోత్రా అధ్యక్షత వహించారు ఈ తరుణంలోనే ఫలితాలు నేడు ఫిబ్రవరి 7న ప్రకటించారు.


Click it and Unblock the Notifications