RBI MPC Meeting 2025 LIVE: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఈరోజు (ఫిబ్రవరి 6) రెండవ రోజుకు చేరుకుంది. అయితే కీలక వడ్డీ రేట్లపై కమిటీ సభ్యులు చర్చించారు, దేశీయ ద్రవ్య పరిస్థితులను పరిష్కరించడానికి అలాగే రూపాయి అస్థిరతను తగ్గించడానికి తీసుకునే చర్యలతో పాటు MPC ఈ నెలలో 25 బేసిస్ పాయింట్ల కోతను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు తెలిపారు.
ముఖ్యంగా కొత్తగా నియమితులైన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ఇది మొదటి పాలసీ సమావేశం. డిసెంబర్ ప్రారంభంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో రాబోయే 3 సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంకు 26వ గవర్నర్‌గా అయన బాధ్యతలు స్వీకరించారు.
Feb 07, 2025, 10:45 am IST
SEBIలో రిజిస్టర్ చేసుకున్న నాన్-బ్యాంకింగ్ బ్రోకర్లకు G-సెకండరీ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ప్లాట్‌ఫామ్ అయిన NDS-OM యాక్సెస్‌ను విస్తరిస్తున్నాం. ట్రేడింగ్ సెటిల్మెంట్ టైమింగ్ కోసం ఆర్బిఐ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనుంది. ఈ బృందం ఏప్రిల్ 30 నాటికి రిపోర్ట్ సమర్పించాలి: ఆర్బీఐ గవర్నర్
Feb 07, 2025, 10:42 am IST
డిజిటల్ మోసాలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఆఫ్‌షోర్ పేమెంట్స్ కి టు-స్టెప్స్ అతేంటికేషన్ విస్తరించాలని ప్రతిపాదించారు. సైబర్ ప్రమాదాల నివారణ ఇంకా డిటెక్టివ్ విధానాలను మెరుగుపరచాలని బ్యాంకులు అలాగే NBFCలను కోరారు: ఆర్బీఐ గవర్నర్
Feb 07, 2025, 10:39 am IST
జనవరి 31 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థకు CD రేషియో 80.8% వద్ద ఉంది, ఇది ఒక నెల క్రితం స్థాయితో సమానంగా ఉంది. NBFC ల కోసం సిస్టమ్ స్థాయి పారామితులు కూడా బలంగా ఉన్నాయి : ఆర్బీఐ గవర్నర్
Feb 07, 2025, 10:24 am IST
గ్రామీణ డిమాండ్ పెరుగుదల ధోరణి, పట్టణ డిమాండ్ మిశ్రమంగా ఉంది. FY26 కి రియల్ GDP వృద్ధి 6.75%, Q1 6.7%, Q2 7% Q3 & Q4 6.5%. ప్రధాన ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేయగా కానీ మితంగా ఉంటుంది. FY25 కి CPI ద్రవ్యోల్బణం 4.8% గా అంచనా : సంజయ్ మల్హోత్రా
Feb 07, 2025, 10:22 am IST
Q3 కార్పొరేట్ ఫలితాలు తయారీ రంగంలో స్వల్ప రికవరీని సూచిస్తున్నాయి. వ్యాపార అంచనాలు ఉత్సాహంగా ఉన్నాయి ఇంకా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి: ఆర్బీఐ గవర్నర్
ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
Feb 07, 2025, 10:10 am IST
సవాలుతో కూడిన కాలాల్లో కూడా ఆర్థిక వ్యవస్థకు అనువైన ద్రవ్యోల్బణ లక్ష్యం ఉపయోగపడింది. ద్రవ్యోల్బణ చట్రాన్ని మెరుగుపరుస్తాము, మరింత బలమైన నమూనాలను అభివృద్ధి చేస్తాము: గవర్నర్ మల్హోత్రా
Feb 07, 2025, 10:07 am IST
MPC తీర్మానాలు దేశంలోని ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. వ్యాపారాలు, ఆర్థికవేత్తలు నుండి అన్ని వర్గాలకు సంబంధించినవి: RBI గవర్నర్ మల్హోత్రా
Feb 07, 2025, 10:05 am IST
ప్రారంభమైన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఎంపీసీ సమావేశం
Feb 07, 2025, 9:29 am IST
ఆర్బీఐ గవర్నర్ దాదాపు పూర్తిగా కొత్త ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. గత నెలలో పదవీ విరమణ చేసిన మైఖేల్ పాత్ర స్థానంలో డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు తాత్కాలికంగా MPCలో చేరారు. అదనంగా అక్టోబర్ నుండి ముగ్గురు ఎక్స్టెర్నల్ సభ్యులు కమిటీలో భాగమయ్యారు.
Feb 07, 2025, 9:24 am IST
డిసెంబర్ 2024 నాటికి కీలక రేట్లను పరిశీలిస్తే రెపో రేటు 6.5%, రెపో రివర్స్ రెపో 3.35%, ఎంఎస్ఎఫ్ 6.75%, సిఆర్ఆర్ 4%గా ఉన్నాయి.
Feb 07, 2025, 9:20 am IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానం ప్రకటించడానికి ముందు, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 11 పైసలు పెరిగి 87.4688 వద్ద ప్రారంభమైంది.
Feb 07, 2025, 9:17 am IST
బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్, RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా వేస్తోంది, దాదాపు ఐదు సంవత్సరాలలో ఇదే మొదటి తగ్గింపు.
Feb 07, 2025, 9:10 am IST
ఫిబ్రవరి 2025లో 0.25% కోత సాధ్యమని SBI పరిశోధన నివేదిక చెబుతోంది. ఏప్రిల్ 2025 నాటికి మొత్తం 0.75% తగ్గింపు సాధించవచ్చని నివేదికలో పేర్కొంది.
Feb 07, 2025, 8:27 am IST
ప్రజల కొనుగోలును పెంచేందుకు మార్కెట్లో లిక్విడిటీ పెంచే దిశగా రిజర్వు బ్యాంక్ నిర్ణయాలు ఉండే అవకాశం
Feb 07, 2025, 8:25 am IST
ఆర్బీఐ నిర్ణయంతో తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీరేట్లు
Feb 07, 2025, 8:24 am IST
రిజర్వు బ్యాంక్ పాలసీ నిర్ణయాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈక్విటీ పెట్టుబడిదారులు
Feb 07, 2025, 8:23 am IST
ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించిన అమెరికా, యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంకులు
Feb 07, 2025, 8:23 am IST
దాదాపు 5 ఏళ్ల తర్వాత మెుదటి సారి వడ్డీ రేట్ల తగ్గింపుకు అవకాశం
Feb 07, 2025, 8:22 am IST
రెపో రేటు తగ్గింపు ప్రకటనతో ఉపశమనం పొందనున్న హోమ్ లోన్, కార్ లోన్స్ తీసుకున్న రుణ గ్రహీతలు
Feb 07, 2025, 8:21 am IST
సవాళ్లతో కూడుకున్న క్లిష్ట సమయంలో బాధ్యతలు చేపట్టిన కొత్త రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
Feb 07, 2025, 8:21 am IST
కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న సంజయ్ మల్హోత్రా
Feb 07, 2025, 8:20 am IST
ఈసారి రెపో పోటు గవర్నర్ తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నిపుణులు
Feb 07, 2025, 8:19 am IST
కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మెుదటి ఎంపీ సమావేశంలో కీలక ప్రకటనలు ఉండే అవకాశం
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.