Next Crisis: ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఆవరించి వ్యాపారాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఇప్పుడు అందరి భయం రాబోయే ఆర్థిక సంక్షోభంపై ఉంది. దీనిపై ఇప్పటికే చాలా కాలంగా అనేక దేశాలు, నిపుణులు చర్చిస్తున్నాయి. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విషయంలో తన హెచ్చరికను పునరుద్ఘాటించారు. క్రిప్టోలు ప్రపంచంలో మరో ఆర్థిక సంక్షోభానికి కారణంగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రిప్టోతోనే ప్రాబ్లమ్..
ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ, రూల్స్ లేని క్రిప్టోలను నిషేధించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది సరైన అవగహన లేనప్పటికీ అనేక క్రిప్టో కాయిన్స్ లలో పెట్టుబడులు పెట్టి నష్టాలపాలు కావటం పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే తర్వాతి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల నుంచి వస్తుందని, తన మాటలను పెడచెవిన పెట్టొద్దని నొక్కి చెప్పారు. క్రిప్టో కరెన్సీలు సెంట్రల్ బ్యాంకుల నియంత్రిత ప్రపంచాన్ని విశ్వసించరని.. వాటిని ఓడించాలనే కాంక్షతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

సాక్ష్యం కళ్ల ముందరే..
అమెరికాలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTX క్రాష్‌ను రాబోయే ఆర్థిక ముప్పుకు రుజువుగా రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. నవంబర్‌లో దివాళా తీయడానికి ముందు FTX 32 బిలియన్ డాలర్లు విలువైన క్రిప్టోకరెన్సీ క్రిప్టో ఎక్స్ఛేంజ్ గా ఉంది. దీనికి తోడు ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వాల్యుయేషన్ 190 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.

బిట్ కాయిన్ పతనం..
గత సంవత్సరం ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ అత్యధికంగా 60,000 డాలర్లకు చేరుకుంది. అయితే నవంబర్ 2021లో ఇది భారీ పతనాన్ని చూసింది. దీని ప్రపంచం మార్కెట్ విలువ గరిష్ఠ స్థాయి అయిన 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు తగ్గి ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పైగా ప్రైవేటు క్రిప్టో ఎక్స్ఛేంజీలకు ఆస్తులు లేకపోవటం చాలా ప్రమాదకరమని దాస్ అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో పరిస్థితి..
దాదాపుగా దశాబ్ధకాలం కిందట క్రిప్టోలు భారత్ లోకి ప్రవేశించినప్పటికీ వాటి పనితీరును రిజర్వు బ్యాంక్ తో పాు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తూనే ఉన్నాయి. ఇటీవల క్రిప్టోలను నియంత్రించాలని కేంద్రం నిర్ణయించటంతో వాటి ట్రాన్సాక్షన్లపై ఉక్కుపాదం మోపుతోంది. అధిక పన్నులతో పాటు ఇతర ఛార్జీలను విధిస్తోంది. "ప్రైవేట్ కరెన్సీల" ట్రేడింగ్ నుండి వచ్చే లాభాలపై 30% పన్ను ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడింది. దీంతో ఇండియాలో ఇన్వెస్టర్లు చాలా వరకు క్రిప్టోలకు దూరంగా జరుగుతున్నారు. 2018లో ఆర్బీఐ నిషేధం విధించగా 2020లో సుప్రీం కోర్టు ఆంక్షలను ఎత్తివేయటంతో అప్పట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేసి నష్టాలను మూటకట్టుకున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications