UPI New feature: భారతీయ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)కు ప్రపంచ వ్యాప్త ఆధరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు, వినియోగదారుల అనుభవాన్ని పెరుగుపరిచేందుకు RBI, NPCIలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సెక్యూరిటీ ఫీచర్స్ లో భాగంగా పిన్‌కు బదులు బయోమెట్రిక్స్ ఆప్షన్ అందించాలని ఇటీవల ఆలోచన చేశాయి. కాగా తాజాగా కస్టమర్లకు RBI గవర్నర్ మరో శుభవార్త వినిపించారు.
అత్యంత తేలికగా, ఖర్చు లేకుండా, నడి రోడ్డుపై నగదు ఇన్సంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గం UPI. అయితే దీనికి కూడా ఓ లిమిటేషన్ కూడా ఉంది. అదేంటంటే రోజుకు లక్ష మాత్రమే ఈ విధానంలో బదిలీ చేయవచ్చు. అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ జరపాలంటే NEFT లేదా RTGS వంటి ఎక్కువ సమయం పట్టే మార్గాలను ఆశ్రయించాల్సిందే. దీంతో యూజర్స్ కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

ఇది గమనించిన RBI ప్రస్తుతం ఉన్న 1 లక్ష లిమిట్ ను 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. 'క్యాపిటల్ మార్కెట్స్, IPO సబ్‌స్క్రిప్షన్స్, రుణాలు, బీమా, వైద్య చెల్లింపులలో UPIని విపరీతంగా వాడుతున్నారు. ఈ క్రమంలో లక్షల లిమిట్ సరిపోదని భావించాం. అందుకే పలు సమీక్ష అనంతరం లిమిట్ పెంపునకు సిద్ధమయ్యాం. ఇందుకు సంబంధించిన వివరణాత్మక ఆదేశాలు త్వరలో జారీ చేయబడతాయి' అని తెలిపారు.
ప్రస్తుతం UPI వ్యవస్థ యూజర్ బేస్ 424 మిలియన్లు కాగా తాజా నిర్ణయంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. లిమిట్ పెంపుతో పాటు ఓ వ్యక్తికి బదిలీ చేసే నగదుపై ఎవరికి వారు స్వయంగా లిమిట్ పెట్టుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇది అతిత్వరలో దేశ ప్రజలకు వాడుకలోకి రానుందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications