భారతదేశంలో బ్యాంకింగ్ సేవలు ప్రతి రోజూ పెరిగిపోతున్నాయి, కానీ కొన్నిసార్లు ఖాతాదారులకు ఇంకా కొన్ని విషయాల్లో సందేహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వ అవసరం. ICICI బ్యాంక్ తాజాగా తన కొత్త ఖాతాలో కనీస నిల్వ రూ.50,000గా ఉండలి అని చెప్పింది. ఈ నిర్ణయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పష్టం చేసినట్లు, ఈ నిర్ణయాలు బ్యాంకుల పరిధిలోనే ఉంటాయని, RBI దీనిపై ఎలాంటి నియంత్రణలు విధించదని అన్నారు.
సంజయ్ మల్హోత్రా గుజరాత్‌లోని ఒక గ్రామ పంచాయతీలో జరిగిన ఆర్థిక అవగాహన శిబిరంలో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "ఎంత కనీస నిల్వ అవసరం అనేది బ్యాంకులే నిర్ణయిస్తాయి. RBI దీన్ని నియంత్రించము. కొన్ని బ్యాంకులు రూ.10,000గా నిర్ణయించాయి, మరికొన్ని రూ.2,000గా ఉంచాయి. కొన్ని బ్యాంకులు అయితే పూర్తిగా మినహాయించాయి కూడా," అని చెప్పారు.

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ICICI బ్యాంక్ తాజాగా తన కొత్త ఖాతాల్లో కనీస నిల్వను రూ.10,000 నుంచి రూ.50,000కి పెంచింది. దీనిపై ప్రజల్లో కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. RBI నియమాల ప్రకారమా ఇదా? లేక బ్యాంకు నిర్ణయమా? దీనికి గవర్నర్ క్లారిటీ ఇచ్చారు ఇది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమే. RBI ఎలాంటి నియమం విధించదు.
ఇదే సందర్భంలో, గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గ్రామాల స్థాయిలో జరిగే ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ క్యాంపుల ప్రాధాన్యతను వివరించారు. "ఇప్పటివరకు లక్షన్నర క్యాంపులు జరిగాయి. దాదాపు 35 లక్షల ఖాతాలకు తిరిగి KYC ప్రక్రియ పూర్తయింది," అని చెప్పారు. ఇది పేద, గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవడానికే ఉద్దేశం.
ICICI బ్యాంక్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వ్యాపారపరంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా తెరిచే కొన్ని ఖాతాలకు మాత్రమే ఇది వర్తించనుంది. జీత ఖాతాలు, మరియు బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రం కనీస నిల్వ అవసరం ఉండదు. అలాగే, కొన్ని ఛార్జీలు కూడా చేస్తున్నట్లు బ్యాంక్ చెబుతోంది. దీనివల్ల బ్యాంకుకు ఎక్కువ నగదు నిల్వలు లభించడం ద్వారా తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవచ్చునన్నది బ్యాంక్ ఉద్దేశ్యం.
అలాగని ప్రతి ఒక్కరు రూ.50,000 నిల్వ ఉండే ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. మీరు నెలవారీ ఖర్చులు చూసుకుని, పెద్దగా నిల్వలు ఉంచలేని పరిస్థితిలో ఉంటే కనీస బ్యాలెన్స్ లేక తక్కువ కనీస బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ఎంచుకోవడం బెటర్. బ్యాంకులు వివిధ రకాల ఖాతాలను అందిస్తున్నాయి అందులో మీ అవసరానికి సరిపడే ఖాతాను ఎంచుకోవాలి. ఖాతా తెరవకముందు చార్జీలు, షరతులు స్పష్టంగా అడిగి తెలుసుకోవడం మంచిది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications