RBI News: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. తన పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారంపై రిజర్వ్ బ్యాంక్ పరిమితులు విధించిన అనంతరం ఉద్యోగులు జారిపోవడం నుంచి ఇద్దరు డైరెక్టర్లు బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నామని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని సంస్థ CEO విజయ్ శేఖర్ శర్మ భరోసా ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.
రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తర్వాత పేటీఎం వ్యవహారంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలను సెంట్రల్ బ్యాంక్ సమీక్షించబోదని తేల్చి చెప్పేశారు. ఆ బ్యాంకు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

'పేటీఎం విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి సమీక్ష ఉందదని నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. అయితే కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్‌బీఐ నిబద్ధతతో పనిచేస్తుంది. ఫిన్‌టెక్ రంగానికి మద్దతును కొనసాగిస్తుంది' అని గవర్నర్ హామీ ఇచ్చారు. పేటీఎంకు సంబంధించి RBI తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) సెట్‌ను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
నిరంతరం బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించడం మరియు మెటీరియల్ పర్యవేక్షణ ఆందోళనల కారణంగా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. కస్టమర్ ఖాతాలు, వాలెట్, ఫాస్ట్‌ట్యాగ్‌లు మరియు ఇతర సాధనాల్లో డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించకుండా జనవరి 31న PPBLపై ఆర్బీఐ విధించిన నిషేధం ఫిబ్రవరి 29 తర్వాత అమల్లోకి రానుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications