rbi governor: భారత బ్యాంకింగ్ వ్యవస్థ గురించి RBI గవర్నర్ ఏమన్నారంటే..
rbi governor: అగ్రరాజ్యం అమెరికాలో తలెత్తిన బ్యాంకుల సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే. సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంకుల్లోని నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ బ్యాంకింగ్ రంగం పనితీరు గురించి ఆయన మాట్లాడారు.

భారత బ్యాంకింగ్ నో వర్రీ:
ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఏమాత్రం ఢోకా లేదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దేశంలోని బ్యాంకులు, NBFCలు సహా ఇతర ఆర్థిక సంస్థలు RBI నియంత్రణ, పర్యవేక్షణలోనే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఫెడరల్ బ్యాంకు వ్యవస్థాపకులు KP హోర్మిస్ స్మారక ఉపన్యాసంలో ఆయన వెల్లడించారు.

సమర్థ నిర్వహణ:
కేవలం సమస్యకు పరిష్కారాన్ని మాత్రమే వెతకకుండా.. దాని మూలాలపై సైతం దృష్టిసారిస్తున్నట్లు RBI గవర్నర్ తెలిపారు. దేశంలోని ఆర్థిక సంస్థల విధులపై ఎప్పటికప్పుడు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అధునాతన డేటాను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నట్లు వెల్లడించారు. అయితే క్రిప్టో కరెన్సీ వంటివి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానూ ప్రమాదకారిగా మారగలవని అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక చర్యలు:
డిజిటల్ చెల్లింపుల భద్రత, నియంత్రణ కోసం ప్రత్యేకంగా సమగ్ర సైబర్ భద్రతా ఫ్రేమ్ వర్కును జారీ చేసినట్లు శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఆర్థిక సంస్థల పర్యవేక్షణ అవసరాల కోసం ఓ సూపర్ వైజర్ల కళాశాలను సైతం స్థాపించినట్లు గుర్తు చేశారు. ఈ విభాగంలో సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచినట్లు చెప్పారు. దేశానికి సంబంధించిన ఆర్థిక స్థిరత్వం సంరక్షణపై ఈ తరహా చర్యలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు.


Click it and Unblock the Notifications