Vegetable prices: సామాన్యుడికి RBI గవర్నర్ గుడ్‌న్యూస్.. దూసుకెళ్తున్న కూరగాయల ధరలకు బ్రేక్
Vegetable prices: విపరీతంగా పెరిగిపోతున్న ధరల కారణంగా సామాన్యుడి వంటగది వేడెక్కుతోంది. టమోటా, ఉల్లి సహా పలు ఆహార పదార్థాల రేట్లు ఎన్నడూ లేని విధంగా తారాస్థాయికి చేరాయి. పేద, మధ్య తరగతి ప్రజలు తట్టుకోలేని రేంజికి ఎగిసిపడుతూ వెక్కిరిస్తున్నాయి. వీటినుంచి ఎప్పుడు ఉపశమనం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ గుడ్ న్యూస్ చెప్పారు.
అతి త్వరలో కూరగాయల ధరలు తగ్గనున్నట్లు RBI గవర్నర్ వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి ఈ మార్పులు గమనించవచ్చని తెలిపారు. లలిత్ దోషీ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేయడం ఇప్పటికీ సవాలుగానే ఉందన్నారు. టమోటా కొత్త పంట మార్కెట్లోకి వస్తుండడంతో.. కీలకమైన ఇతర ఆహార ధరలు కూడా గణనీయంగా తగుముఖం పట్టినట్లు చెప్పారు.

పెరుగుతున్న తృణధాన్యాలు, కూరగాయల ధరల వల్ల గత నెలలో దేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతంగా నమోదు అయింది. మానిటరీ పాలసీ కమిటీ నిర్దేశిత లక్ష్యానికిపైగా కొనసాగడంపై RBI దీని కట్టడికి దృష్టి సారించినట్లు దాస్ వెల్లడించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తుచేశారు.
సామాన్యుడికి కొంత ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే నేపాల్ నుంచి టమోటాలు దిగుమతి చేసుకుంటోంది. రిటైల్ మార్కెట్లో వీటిని 50 చొప్పున విక్రయిస్తోంది. ఉల్లిపాయ బఫర్ స్టార్ కూడా 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 5కు పెంచింది. అందుబాటులో ఉన్న బఫర్ స్టాక్ నుంచి బహిరంగ మార్కెట్ కు విడుదల చేస్తోంది. వీటిని రిటైల్ అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్స్ ద్వారా కిలో 25 సబ్సిడీ రేటు తో వినియోగదారులకు అందిస్తోంది.


Click it and Unblock the Notifications