Crypto: క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఒకరకమైన జూదమని, పెరగడానికి అనుమతించకూడదని అభిప్రాయపడ్డారు. సరైన నియంత్రణ లేకపోతే కేంద్ర బ్యాంకులను, ఆర్థిక వ్యవస్థను సైతం అణగదొక్కుతుందని మరోసారి హెచ్చరించారు. క్రిప్టో ఆస్తుల విషయం పట్ల జాగ్రత్త వహించాలని వినియోగదారులకు సూచించారు.

నియంత్రణకు ముప్పు:
దేశంలోకి క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే లావాదేవీల పర్యవేక్షణపై ఆర్‌బీఐ నియంత్రణను కోల్పోయే అవకాశం ఉందని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో శక్తికాంత దాస్ వెల్లడించారు. వాటికి ఎలాంటి అండర్‌లైన్ ఆస్తులు లేవని, కేలవం ఓ మార్పిడి సాధనంగా ఊహలకు మాత్రమే పరిమితమని వ్యాఖ్యానించారు.

మొదటినుంచి వ్యతిరేకమే...
మొదటినుంచి క్రిప్టోకరెన్సీలకు రిజర్వ్ బ్యాంకు వ్యతిరేకంగానే ఉంది. వాటి నిషేధానికి బహిరంగంగానే పిలుపునిచ్చింది. దేశంలో క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై ఇప్పటికీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. 'క్రిప్టో లావాదేవీల వల్ల ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని నిర్ణయించడం సవాలుగా మారుతుంది. ఎఫ్‌టీఎక్స్ వైఫల్యం, గత రెండేళ్లలో క్రిప్టోమార్కెట్‌ను పోల్చి చూస్తే వాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు' అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు.

చట్టబద్దం కాదు:
వర్చువల్ కరెన్సీల వినియోగానికి వ్యతిరేకంగా 2013లో ఆర్బీఐ ఓ సర్క్యులర్ జారీ చేసింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని వ్యాపారులను హెచ్చరించింది. వాటితో పొంచి ఉన్న నష్టాల గురించి వివరించింది. వర్చువల్ కరెన్సీలు చట్టబద్ధం కాదని ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ 2017లో తేల్చి చెప్పాయి. వాటిపై నిషేధం విధించాలని సైతం ఆలోచనలు చేశాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications