Interest rates: స్టాక్ మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌తో దూసుకుపోతున్నాయి. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో ఇవాళ కీలక వడ్డీరేట్లను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. మానిటరీ పాలసీ మీటింగ్ ఫలితం కోసం ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ రెపో రేటును ప్రకటించనున్నారు. ద్రవ్యోల్బణం 6 శాతం గరిష్ఠ స్థాయికి చేరడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ కారణంగా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతధంగా కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య అంతకంతకూ పెరుగుతూ పోయిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఫిబ్రవరి 2023లో 6.25 శాతం నుండి 6.5 శాతానికి పెంచింది. గతేడాది జూలైలో గరిష్ఠ స్థాయి 7.44 శాతాన్ని తాకి భయపెట్టినా, మెల్లగా తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పటికీ ఆర్బీఐ కంఫర్ట్ జోన్ మించే ఉండటం ఇబ్బంది కలిగిస్తోంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) మంగళవారం నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరిపింది. 'అతిగా బిగించడం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రమాదంగా పరిణమిస్తుంది' అని వ్యాఖ్యానించిన గవర్నర్.. మరోసారి తటస్థ వైఖరిని అనుసరిస్తామో వేచి చూడాలి మరి!
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications