విదేశీ ఇన్వెస్టర్లకు భారీ ఆఫర్.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చబోతున్న RBI మాస్టర్ ప్లాన్!

భారత ఆర్థిక రంగంలో తాజాగా ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. నిర్దేశిత ప్రభుత్వ సెక్యూరిటీలలో (Government Securities లేదా G-Secs) పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (Capital Gains Tax) నుంచి ప్రభుత్వం పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. వినడానికి ఇది చాలా టెక్నికల్ మ్యాటర్‌లా అనిపించినా, దీని వెనుక దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే పెద్ద వ్యూహం ఉంది. దీనివల్ల దేశంలో బాండ్ మార్కెట్ బలోపేతం అవ్వడమే కాకుండా, ప్రభుత్వం , కంపెనీల అప్పుల ఖర్చు తగ్గి, సామాన్యుడికి కూడా మేలు జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఆర్‌బీఐ (RBI) పాత్ర ఏంటి, అసలు ఈ బాండ్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో సింపుల్‌గా తెలుసుకుందాం.

RBI G Sec Reform Foreign Investors Capital Gains Tax Exemption FAR Route

ప్రభుత్వ సెక్యూరిటీలు (G-Secs) అంటే ఏంటి?

కేంద్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుల కోసం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం మార్కెట్ నుంచి అప్పు తీసుకోవడానికి జారీ చేసే బాండ్లనే 'గవర్నమెంట్ సెక్యూరిటీస్' అంటారు. వీటికి భారత ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి, దేశంలోనే ఇవి అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనాలు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు విదేశీ ఇన్వెస్టర్లు కూడా వీటిని కొనుగోలు చేస్తారు.

బాండ్ యీల్డ్ (Bond Yield) అంటే ఏంటి?

ఒక బాండ్ మీద ఇన్వెస్టర్‌కు వచ్చే రిటర్న్ లేదా లాభాన్ని 'బాండ్ యీల్డ్' అంటారు. మార్కెట్‌లో బాండ్ల ధరలు, యీల్డ్స్ ఎప్పుడూ రివర్స్‌లో కదులుతాయి. అంటే, ఒక బాండ్‌కు డిమాండ్ పెరిగి ధర పెరిగితే, దాని యీల్డ్ (వడ్డీ రేటు) తగ్గుతుంది. మన దేశంలో '10-year benchmark bond yield' ని బట్టే బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీల లోన్ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి.

విదేశీ ఇన్వెస్టర్లు మనకు ఎందుకు ముఖ్యం?

ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి..

  • స్థిరమైన పెట్టుబడులు: విదేశీయులు లాంగ్ టర్మ్ బాండ్లలో పెట్టే పెట్టుబడుల వల్ల రోడ్లు, రైల్వేలు, క్లైమేట్ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సులభంగా దొరుకుతాయి.
  • తక్కువ వడ్డీ భారం: బాండ్లను కొనడానికి ఎక్కువ మంది పోటీ పడితే, యీల్డ్స్ (వడ్డీ రేట్లు) తగ్గుతాయి. దీనివల్ల ప్రభుత్వం తక్కువ వడ్డీకే అప్పులు తెచ్చుకోవచ్చు.
  • లిక్విడిటీ (నగదు లభ్యత): మార్కెట్‌లో ట్రేడింగ్ పెరిగి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్లను కొనే, అమ్మే సౌకర్యం పెరుగుతుంది.

సామాన్యుడికి ఏం లాభం?

ఈ బాండ్ యీల్డ్స్ తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది.

  • కార్పొరేట్ కంపెనీల అప్పుల ఖర్చు తగ్గుతుంది.
  • బ్యాంకులు తక్కువ వడ్డీకే నిధులను సేకరించగలవు.
  • దీనివల్ల భవిష్యత్తులో సామాన్యులు తీసుకునే హోమ్ లోన్స్, కార్ లోన్స్ పై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది.

మానిటరీ పాలసీ ట్రాన్స్‌మిషన్ అంటే ఏంటి?

మనం తరచూ ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించింది లేదా పెంచింది అని వింటుంటాం. ఆర్‌బీఐ తీసుకునే ఈ నిర్ణయాలు మార్కెట్ లోని వడ్డీ రేట్లలోకి వేగంగా మారడాన్నే 'మానిటరీ పాలసీ ట్రాన్స్‌మిషన్' అంటారు. బాండ్ మార్కెట్ బలంగా ఉంటే, ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే బ్యాంకులు కూడా తమ లోన్ రేట్లను తగ్గించడానికి వీలవుతుంది. అలాగే, ఆర్‌బీఐ మార్కెట్లో లిక్విడిటీని కంట్రోల్ చేయడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMOs) ద్వారా ఈ బాండ్లను కొంటూ, అమ్ముతూ ఉంటుంది.

ఫుల్లీ యాక్సెస్ బుల్ రూట్ (FAR) అంటే ఏంటి?

విదేశీయులు ఎలాంటి లిమిట్స్ లేకుండా భారత ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి తెచ్చిందే ఈ FAR రూట్. తాజాగా ఆర్‌బీఐ (RBI) జూన్ 5న ఈ రూట్‌ను మరింత విస్తరిస్తూ కొత్తగా వచ్చే 15, 30, 40 సంవత్సరాల లాంగ్ టర్మ్ బాండ్లను కూడా ఇందులో చేర్చింది. ఈ గ్లోబల్ ఇంటిగ్రేషన్ వల్ల గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లలో భారత్‌కు స్థానం దక్కి, అంతర్జాతీయంగా మన దేశ క్రెడిబిలిటీ మరింత పెరగబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+