Repo Rate Hike: ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుదల చాలా సంక్షోభంగా మారుతోంది. దేశంలోను దీని పెరుగుదల చాలా ఆందోళనను కలిగిస్తోంది. దీనిని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంక్ గత కొంత కాలంగా వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో నాలుగోసారి వరుసగా వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది.
అందరి అంచనాలను మించి ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచేసింది. దీని కారణంగా రుణాలు భారంగా మారనున్నాయి.

ఓలటైల్ గా మార్కెట్లు..
ఉదయం 250 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ ప్లారంభమైనప్పటికీ.. రిజర్వు బ్యాంక్ రేట్ల పెంపు ప్రకటన తరువాత ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లు 11 గంటల సమయంలో లాభాల్లో కొనసాగుతున్నాయి. కీలక సూచీలు పచ్చరంగులో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభంతో ఉండటం.. పెట్టుబడులకు మదుపలు ఆసక్తికి అద్ధం పడుతోంది.

పెరిగిన వడ్డీ రేట్లు ఇలా..
నాలుగోసారి వడ్డీ రేట్లను పెంచటం వల్ల రెపో రేటు 5.90 శాతానికి చేరుకుంది. ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ తన జీడీపీ వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల కరెన్సీల కంటే భారత రూపాయి మెరుగైన పనితీరును కనబరుస్తోందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

గరిష్ఠాలకు రెపో రేట్..
ప్రస్తుత పెంపు వల్ల రెపో రేటు మూడేళ్ల గరిష్ఠాలకు చేరుకుంది. మే నెల నుంచి ఇప్పటి వరకు రెపో రేటు 1.90 శాతం మేర పెరగటం ఆందోళన కలిగిస్తోంది. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేట్లు పెరగటానికి ద్రవ్యోల్బణం కారణంగా మారింది. మోదీ ప్రభుత్వ చరిత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు ఇంత దారణంగా పెరుగటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత చరిత్రలో ఎన్నడూ రేట్లు ఇంత భారీ స్థాయిలో పెరగలేదని గణాంకాలు చెబుతున్నాయి.

రేటు పెంపు ప్రభావం కనుక్కోండిలా..
తాజాగా రిజర్వు బ్యాంక్ రేట్లను పెంచటం వల్ల ఇప్పటికే హౌసింగ్ లోన్, కార్ లోన్ పర్సనల్ లోన్ వంటివి తీసుకున్నవారిపై వడ్డీ ప్రభావం భారీగా పెరగనుంది. హోమ్ లోన్ పెరుగుదల ప్రభావాన్ని కనుక్కోవటానికి ఈ క్యాలుక్లేటర్ ఉపయోగపడుతుంది. https://www.hdfc.com/home-loan-emi-calculator ఈ లింక్ ద్వారా ఎవరైనా మారుతున్న వడ్డీ రేటు వల్ల లోన్ ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications