Raghuram Rajan: ఇన్‌ఫ్లేషన్‌ను తగ్గించేందుకు రంగంలోకి దిగిన భారత సెంట్రల్ బ్యాంక్ కు ముందు మరింత టఫ్ పరిస్థితులు తప్పవని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. దీనికి ఎంతో దూరం లేదని ఆయన అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోరాడే ప్రయత్నంలో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచాయి. ఈ బుధవారమే.. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులకు రుణాలు ఇచ్చే కీలక వడ్డీ రేటును తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచటంతో రెపో రేటు 4.9 శాతానికి చేరుకుంది.
చమురు ధరలే కారణమా..?
ఇప్పుడు అందరి దృష్టి మే నెలకు సంబంధించిన అమెరికా CPI ద్రవ్యోల్బణం డేటాపై ఉంది. ఆర్థికవేత్తలు వార్షిక పెరుగుదల 8.3 శాతం, ప్రధాన ద్రవ్యోల్బణం 5.9 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చికాగో విశ్వవిద్యాలయం - బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రాజన్.. చమురు ధరల పెరుగుదల కారణంగా ఇంకా కొన్ని ప్రభావాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. హెడ్‌లైన్, కోర్ ద్రవ్యోల్బణంలోకి ఫీడ్ అవుతుంది. కనుక మనం ఇంకా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిని చూడలేదని ఆయన వెల్లడించారు. ఈ తరుణంలో యూఎస్ ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు కీలక వడ్డీ రేట్లను ఎంత వరకు పెంచుతుందనేది ముఖ్యమైన ప్రశ్న అని రాజన్ అన్నారు.

వడ్డీ రేట్ల పెంపు మళ్లీ ఉంటుందా..
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) కూడా దాని వృద్ధి అంచనాలను తగ్గించుకుంది. పైగా ద్రవ్యోల్బణం అంచనాను పెంచింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 8 శాతంగా ఉంది. దీనికి ప్రధాన కారణంగా ఇంధన ధరలు నిలుస్తున్నాయి. అయితే రానున్న మరిన్ని ద్రవ్యపరపతి సమీక్షల్లో భారత రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును మరో 100 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని అంచనాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావటానికి మరో ఏడాది కాలం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications