Sovereign Gold Bonds: దేశంలో చాలా మంది ఇన్వెస్టర్లు డిజిటల్ రూపంలో గోల్డ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ ఆగస్టు 5, 2016న జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ రిడెమ్షన్ ధరను ప్రకటించింది.
ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆగస్టు 05, 2024న మెచ్యూర్ అయ్యే సావరిన్ గోల్డ్ బాండ్స్ రిడెంప్షన్ ధరను గ్రాముకు రూ.6,938గా నిర్ణయించింది. ఇది వాస్తవంగా జారీ చేసిన ధర కంటే 122 శాతం అధికం. వాస్తవానికి ఆర్బీఐ ఆగస్టు 2016లో గోల్డ్ బాండ్లను గ్రాము ధర రూ.3,119తో జారీ చేసింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై వార్షికంగా 2.75% వడ్డీ రాబడిని సైతం అందుకున్నారు. దీనిని సైతం పరిగణలోకి తీసుకుంటే 2016 ఆగస్టు సిరీస్ గోల్డ్ బాండ్స్ కొన్న వ్యక్తుల రాబడి మొత్తం 144% కంటే కొంచెం ఎక్కువకు చేరుకుంది. ఈ క్రమంలో వడ్డీ మెుత్తం నేరుగా బాండ్ హోల్డర్ల ఖాతాలకు పంపబడుతుంది.

రిజర్వు బ్యాంక్ ప్రస్తుత రేటును జూలై 29- ఆగస్టు 02, 2024 రోజున మార్కెట్ విక్రయ ధర సగటును ప్రస్తుత రిడెంప్షన్ ధరగా నిర్ణయించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధర సాధారణ సగటు ఆధారంగా SGBల ధర నిర్ణయించబడుతుంది. వాస్తవానికి బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులు భౌతిక బంగారాన్ని హోల్డ్ చేయటానికి ప్రత్యామ్నాయంగా ఈ బాండ్లు ప్రవేశపెట్టబడ్డాయి. ప్రభుత్వం తరపున ఈ బాండ్ల జారీ అధికారంగా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కలిగి ఉంది.
సావరిన్ గోల్డ్ బాండ్స్ పనితీరును గమనిస్తే వీటిని 8 ఏళ్ల కాలవ్యవధి కోసం జారీ చేయబడ్డాయి. ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 ప్రకారం వీటి జారీ జరుగుతోంది. ఎవరైనా వ్యక్తి సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు వారు 2.5 శాతం వార్షిక వడ్డీని అందుకుంటారు. మెచ్యూరిటీ తర్వాత ప్రధాన మొత్తంతో పాటు చివరి వడ్డీ చెల్లింపు చేయబడుతుంది. స్కీమ్ కింద వ్యక్తులు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల వరకు బాండ్లను కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు. అలాగే గోల్డ్ బాండ్‌లపై వచ్చే వడ్డీ ఆదాయపు పన్ను చట్టం, 1961లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా పన్ను విధించబడుతుంది.
సెప్టెంబరు 2024లో జరగనున్న సమావేశంలో స్కీమ్ భవిష్యత్తు గురించి చర్చించనున్నారు. ఈ సమావేశం ఆర్బీఐ లోన్ క్యాలెండర్ సమావేశానికి అనుగుణంగా ఉంటుంది. ఇది నిధులను సేకరించేందుకు, మార్కెట్‌లో భౌతిక బంగారం కోసం స్పష్టమైన డిమాండ్‌ను తగ్గించడానికి ప్రభుత్వ ప్రయత్నాల్లో కీలక పాత్రను పోషిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications