క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు టోకెనైజేషన్ గడువును కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పొడిగించింది. కార్డు టోకెనైజేషన్ గడువు ప్రస్తుత నిర్ణయం మేరకు జూన్ 30వ తేదీతో ముగుస్తోంది. అయితే తాజాగా మరో నెలలు గడువును పొడిగించింది. టోకెనైజేషన్ విధానం అమలుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.
టోకనైజేషన్ ఆన్‌లైన్ వ్యాపారులను వారి సర్వర్‌లలో కస్టమర్ డేటాను నిల్వ చేయడాన్ని నిషేధిస్తుంది. ఇందులో కార్డు నెంబర్, సీవీవీ, గడువు తేదీ ఇతర సున్నితమైన, కీలకమైన సమాచారం ఉంటాయి. ఈ సమాచారం దుర్వినియోగం కాకుండా, సైబర్ నేరగాళ్లకు ఈ సమాచారం చిక్కకుండా ఉపయోగపడుతుంది. కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్బీఐ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ కార్డు టోకెనైజేషన్ విధానాన్ని తీసుకు వచ్చింది. తొలుత దీనిని 2020 మే నెలలో ప్రతిపాదించింది. 2021 జూన్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. కానీ పేమెంట్ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో గడువును 2021 డిసెంబర్ 31, తర్వాత జూన్ 30కి మార్చారు. ఇప్పుడు సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications