RBI News: తన ఫేక్ వీడియోలపై స్పందించిన RBI మాజీ గవర్నర్.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Raghuram Rajan: రోజురోజుకూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. నకిలీ వీడియోలను సృష్టించి మహిళలను కించపరుస్తూ పైశాచిక ఆనందం పొందే వారు కొందరైతే, వాటిని క్యాష్ చేసుకునే వారు మరికొందరు. ఇన్వెస్ట్‌మెంట్ సలహాల పేరిట ఈ తరహా నకిలీ వీడియోల ద్వారా పెట్టుబడిదారులను పలువురు మోసగాళ్లు నట్టేట ముంచుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ గా రఘురామ్ రాజన్ గతంలో సేవలందించారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పేరిట నకిలీ వీడియోలను క్రియేట్ చేసి పెట్టుబడి సలహాలు ఇచ్చినట్లు తప్పుగా పేర్కొంటున్నట్లు రాజన్ వెల్లడించారు. అవి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చెలామణి అవుతున్నాయన్నారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

తాను ఎప్పుడూ ప్రజలకు పెట్టుబడి సలహాలు ఇవ్వనని, వ్యక్తిగత స్టాక్స్‌ను ప్రచారం చేయలేదని రాజన్ తెలిపారు. ప్రతి వ్యక్తికి వారి స్వంత ఆర్థిక అవసరాలు మరియు రిస్క్ ఆకలి ఉన్నాయి, అన్నారాయన. అయినప్పటికీ కొన్ని ఫేక్ వీడియోలు హల్ చేస్తున్నట్లు తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు. అవి నకిలీవని, ఇందుకు పాల్పడిన వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు.
'పెట్టుబడిదారులు వ్యక్తిగత స్టాక్‌లు లేదా స్టాక్ ఆప్షన్‌లను కొనుగోలు చేయడం కంటే బ్యాంక్ డిపాజిట్లు, బాండ్‌లు, మ్యూచువల్ ఫండ్స్ మరియు ETFల ద్వారా వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉండటం ఉత్తమం. మీరు ఎంత అదృష్టవంతులు, ధనవంతులు అయినా మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్లి పేదలుగా మార్చే అవకాశంఉంది. అందుకే దయచేసి నిర్దిష్ట స్టాక్‌లో పెట్టుబడులు పెట్టమని సూచించే అన్ని వీడియోలను విస్మరించండి' అని రాజన్ సూచించారు.


Click it and Unblock the Notifications