Gold News: కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థల్లో రిస్క్ అవర్షన్ ఏర్పడింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఇలాంటి అనిశ్చితులను ఎదుర్కోవటంలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది.
ఇలాంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద బంగారం నిల్వలను పెంచుకుంది. RBI డేటాను పరిశీలిస్తే మార్చి 2020లో ఫారెక్స్ నిల్వల్లో కేవలం బంగారం వాటా 6 శాతంగా ఉంది. అయితే మార్చి 24, 2024న రిజర్వు బ్యాంక్ బంగారం నిల్వలు 7.85 శాతానికి పెరిగాయి. అంటే విలువ ప్రకారం రూ.2.09 లక్షల కోట్లు విలువైన బంగారం 2020లో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.3.75 లక్షల కోట్ల ఖరీదైన గోల్డ్ ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతున్న తరుణంలో చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి. 2022లో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలకు దాదాపు 70 బిలియన్ డాలర్ల విలువైన 1,136 టన్నుల బంగారాన్ని జోడించాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది. అనిశ్చితితో కూడిన ఆర్థిక పరిస్థితుల్లో బంగారం అత్యంత సురక్షితమైనది, క్రాస్ బోర్డర్ కరెన్సీ మాదిరిగా పనిచేస్తుంది కాబట్టి సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకున్నాయి.
విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవటం, యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్ల పెంపు వంటి కారణాలతో రూపాయి విలువ 2022లో భారీగా పడిపోయింది. డాలర్ తో మారకపు విలువ 83 మార్కును దాటడం ఆందోళనను కలిగించింది. అలాగే బంగారం నిల్వలు భారీగా పెరగటానికి.. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి అనేక కారణాలు కారణాలుగా నిలిచాయి.
ఈ తరుణంలో బంగారం నిల్వలు పెరిగే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని డీలర్లు అంచనా వేస్తున్నారు. చాలా సెంట్రల్ బ్యాంకులు కేవలం విదేశీ మారక నిల్వల్లో కరెన్సీలనే కాకుండా బంగారాన్ని కలిగి ఉండేందుకు మెుగ్గుచూపటమే కొనుగోళ్లకు అసలు కారణంగా నిలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!



Click it and Unblock the Notifications