ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 31 మార్చి 2024న బ్రాంచులు తెరిచి ఉండేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి రోజు 31 మార్చి ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్) ప్రభుత్వ హాలిడే కూడా మార్చ్ 31 ఆదివారం రానుంది.
ఆదివారం బ్యాంకులు తెరిచి ఉండాలని ఆర్‌బిఐ ఎందుకు కోరింది ?
ప్రతి నెల అన్ని ఆదివారాలు, 2వ ఇంకా 4వ శనివారాల్లో బ్యాంకులు సాధారణంగా మూసివేస్తుంది. అయితే RBI ఒక ప్రకటనలో "2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని చెల్లింపులకు సంబంధించిన పూర్తి లావాదేవీలను లెక్కించడానికి లావాదేవీలతో వ్యవహరించే అన్ని బ్యాంకుల అన్ని శాఖలను 31 మార్చి 2024 (ఆదివారం) నాడు తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం కోరింది" అని పేర్కొంది.

దీని ప్రకారం, ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ వ్యాపారాలతో వ్యవహరించే అన్ని శాఖలను 31 మార్చి 2024 (ఆదివారం) న తెరిచి ఉంచాలని సూచించింది. పైన పేర్కొన్న బ్యాంకింగ్ సేవలపై బ్యాంకులు ప్రజలకు తగిన సమాచారం ఇవ్వాలని RBI పేర్కొంది.
ఏజెన్సీ బ్యాంకులు అంటే ఏమిటి?
ప్రభుత్వానికి ఏజెంట్లుగా వ్యవహరించడానికి అలాగే ప్రభుత్వం తరపున వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారం ఇచ్చిన వాణిజ్య బ్యాంకులను ఏజెన్సీ బ్యాంకులు అంటారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు, సేవలను సులభం చేయడంలో ఈ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే కొన్ని ముఖ్యమైన పనుల్లో పన్నుల వసూలు, ప్రభుత్వ చెల్లింపులు ఉంటాయి.
ఏజెన్సీ బ్యాంకుల లిస్ట్
షెడ్యూల్డ్ ప్రభుత్వ రంగ బ్యాంకులు (విలీనం తర్వాత) బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షెడ్యూల్డ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు,
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, DCB బ్యాంక్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, HDFC బ్యాంక్ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, IDBI బ్యాంక్ లిమిటెడ్, IDFC FIRST బ్యాంక్ లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, RBL బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యెస్ బ్యాంక్ లిమిటెడ్, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, CSB బ్యాంక్ లిమిటెడ్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్
విదేశీ బ్యాంకులు
DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications