Paytm News: కొత్త అవతారం ఎత్తనున్న పేటీఎం.. NPCI ఓకే కోసం వెయిటింగ్

RBI News: ఆర్బీఐ ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎం.. కొత్త దారులు వెదుకుతోంది. మార్కెట్‌లో తన వ్యాపార భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు శ్రమిస్తోంది. ఇందులో భాగంగా UPI సేవలను కొనసాగించేందుకు అంగీకరించాలని రిజర్వ్ బ్యాంక్ పై ఒత్తిడి తెస్తోంది.

తన UPI సేవలను కొనసాగించేందుకు గాను ఇతర బ్యాంకులతో భాగస్వామిగా ఉండాలని పేటీఎం భావిస్తోంది. ఇందులో భాగంగా థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా మారేందుకు చూస్తోంది. ఇందుకు ఆమోదం కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పేటీఎం మాతృసంస్త One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ అభ్యర్థించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఆర్బీఐ సూచించింది.

RBI directed NPCI to look into Paytm proposal for third party app request for UPI

నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకుగాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ జనవరి 31న ఆంక్షలు విధించింది. మొదట ఫిబ్రవరి 29 తర్వాత కొత్త కస్టమర్‌లను జోడించుకోకూడదంటూ నిషేధించింది. తాజాగా ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో పేటీఎం తన UPI సేవలను కొనసాగించేందుకు ఇతర బ్యాంకులతో భాగస్వామ్యాల కోసం వెతుకుతోంది.

వ్యాపార చెల్లింపులను సెటిల్ చేయడానికి కంపెనీ ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇదే వ్యవహారంపై మరికొందరు రుణదాతలతోనూ చర్చలు జరుపుతోంది. TPAP హోదాను NPCI మంజూరు చేస్తే అంతరాయాలను నివారించడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి పేటీఎం హ్యాండిల్స్‌ను కొత్తగా గుర్తించిన బ్యాంకుల సెట్‌కు తప్పనిసరిగా మార్చాలని ఆర్బీఐ తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+