Easy Loans: రుణగ్రహీతల కోసం RBI కొత్త ప్లాట్‌ఫారమ్.. ఇకపై నిమిషాల వ్యవధిలోనే లోన్స్

Easy Loans: దేశంలో రుణ గ్రహీతల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త పబ్లిక్ టెక్ ప్లాట్ ఫారమ్ ప్రారంభించింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే లోన్స్ ఇచ్చేందుకు రుణదాతలకు కావలసిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో క్షణాల్లో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

RBI యాజమాన్యంలోని రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈ పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా బ్యాంకులు, NBFCలు, ఫిన్‌ టెక్ సంస్థలును ఒకేచోట చేర్చినట్లవుతుంది. తద్వారా ఆర్థిక సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు రుణ సామర్థ్యం పెరుగుతుందని బ్యాలెన్స్ హీరో ఇండియా COO సౌపర్నో బాగ్చి తెలిపారు.

RBI developed public tech platform to ease lending process

సాధారణంగా రుణం పొందాలంటే వివిధ రకాల డాక్యుమెంట్స్ ను బ్యాంకులు, NBFCల వంటి ఆర్థిక సంస్థలకు రుణగ్రహీతలు అందించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించడానికి వారు పలుచోట్లకు తిరగాల్సి వస్తోంది. తాజాగా RBI తీసుకున్న చొరవతో ఈ ఇబ్బందికి చెక్ పెట్టినట్లే. ఎందుకంటే ఆధార్, పాన్ సహా ఇతర ధ్రువీకరణ పత్రాలను ఆర్థిక సంస్థలే RBI నుంచి యాక్సెస్ చేసే అవకాశం లభిస్తుంది.

పైలట్ ప్రాజెక్టుగా 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు లోన్స్, డెయిరీ రుణాలు, హామీ లేని MSME, వ్యక్తిగత, రుణాలతోపాటు బ్యాంకుల ద్వారా గృహ రుణాలపైనా మొదటగా దృష్టి సారించనున్నారు. e-KYC, కొన్ని రాష్ట్రాల భూ రికార్డులు, ఉపగ్రహ డేటాను అత్యంత సులభంగా బ్యాంకర్స్‌ కు RBI అందించనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+