Banking News: లోన్ డిఫాల్ట్ పెనాల్టీల వాయిదా.. రుణగ్రహీతలకు ఊరట ఆర్బీఐ ఊరట..
Loan Default: చాలా మంది బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి అవసరాల కోసం తీసుకునే రుణాలను సకాలంలో తిరిగి చెల్లించటంలో పలుమార్లు విఫలమౌతుంటారు. ఇలాంటి వారికి ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కొంత కాలం ఊరటను కలిగించనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో చాలా మంది ప్రజలు వివిధ అవసరాల కోసం విరివిగా లోన్స్ తీసుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వివిధ ఇబ్బందుల వల్ల సకాలంలో రుణ చెల్లింపులు చేయలేక డిఫాల్ట్ అయిన వారిపై కొత్త పెనాల్టీ ఛార్జీల నిబంధనల అమలును వాయిదా వేసింది. వాస్తవానికి జనవరి 1 నుంచి అమలులోకి రావాల్సిన ఛార్జీలను ఏప్రిల్ 1కి వాయిదా వేయబడ్డాయి. అయితే ఈ రూల్స్ కొత్తగా లోన్ తీసుకునేవారికి మాత్రమే.

కొత్తగా రుణాలు తీసుకునేవారికి నయా పెనాల్టీ రూల్స్ జూన్ 30, 2024 నుంచి అమలు చేయబడనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను రిజర్వు బ్యాంక్ శుక్రవారం నోటిఫై చేసింది. లోన్ పేమెంట్ చెల్లించలేక డిపాల్ట్ అయిన సందర్భంలో బ్యాంకులు పెనాల్టీ వడ్డీ రేట్లు విధించకుండా ఈ కొత్త నిర్ణయం ఉపయోగపడుతుంది. అంటే లోన్ చెల్లించలేని వారికి అదనపు వడ్డీ భారం మరో మూడు నెలల పాటు కొత్త రూల్స్ ప్రకారం ఉండదనమాట. ఏప్రిల్ 1, 2024 నుంచి తీసుకునే కొత్త లోన్స్ కి మాత్రమే ఈ రూల్స్ అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే తీసుకున్న రుణాల విషయంలో ఈ సదుపాయం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
లోన్ చెల్లించలేని వారిపై విధించే ఛార్జీలే పెనాల్టీ ఛార్జీలు. అయితే ఇవి వడ్డీ రూపంలో ఉండకూడదని.. కేవలం పెనాల్టీగానే ఉండాలని రిజర్వు బ్యాంక్ గత ఏడాది విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పెనాల్టీ ఛార్జీలపైన మళ్లీ వడ్డీ లెక్కించకూడదు. అలాగే వ్యాపారేతర రుణాలను వ్యక్తులకు మంజూరు చేసినప్పుడు సంస్థలతో పోలిస్తే వారిపై విధించే ఛార్జీలు తక్కువగా ఉండాలి.


Click it and Unblock the Notifications