RBI News: మార్కెట్లలో ఇంకా చల్లారని ఎన్నికల వేడి.. ఇన్వెస్టర్ల ఫిర్యాదులతో దిగొచ్చిన RBI..
Mutual Funds: ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సైతం పూర్తైంది. అయితే ఆ రోజు చెలరేగిన వివాదం ఇంకా ముగియలేదు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ఫిర్యాదులతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఈ వ్యవహారంపై తాజాగా RBI స్పందించింది.
UPI చెల్లింపుల వ్యవస్థలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లోపం వల్ల ఎటువంటి అంతరాయాలు నమోదు కాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. ఆయా బ్యాంకుల వద్ద సాంకేతిక ఇబ్బందులు తలెత్తి ఉండవచ్చని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అందువల్లనే ఎలక్షన్స్ ఫలితాల రోజు మ్యూచువల్ ఫండ్స్ సరైన సమయానికి ఫండ్ హౌస్‌లకు క్రెడిట్ కాలేదని వెల్లడించారు.

మ్యూచువల్ ఫండ్స్ పేమెంట్స్‌లో UPI ఛానల్ ద్వారా జరిపిన చెల్లింపులను స్వీకరించడంలో అంతరాయం ఏర్పడినట్లు పలువురు కస్టమర్లు కంప్లైంట్ చేశారు. ఈ కారణంగా జూన్ 4న మార్కెట్లు కుప్పకూలిన రోజు క్రెడిట్ కావాల్సిన యూనిట్లు జూన్ 5వ తేదీ ఆధారంగా కేటాయింపు జరిగిందని ఫైర్ అయ్యారు. దీంతో భారీ స్థాయిలో తాము లాభాలను నష్టపోవాల్సి వచ్చినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో BSE నుంచి కూడా ఎటువంటి సమస్య లేదని ఎక్స్ఛేంజ్ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఇప్పుడు NPCI తరఫున RBI సమాధానం ఇచ్చింది.
ఇదే కాకుండా UPI సిస్టమ్స్ ద్వారా అంతరాయాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో RBI గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. అన్ని నియంత్రణ సంస్థలు ముందుగా నిర్ణయించిన లేదా అత్యవసర అంతరాయాలను నివేదించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై RBI దృష్టి సారించిన తర్వాత ఈ తరహా అంతరాయాలు 1 శాతం దిగువకు పడిపోయాయని ప్రకటించారు.


Click it and Unblock the Notifications