RBI News: భారత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన కరెన్సీని రిజర్వు బ్యాంక్ ముద్రిస్తుంటుంది. అయితే సర్క్యులేషన్ లోకి విడుదల చేసిన రూ.500 నోట్లు మిస్ అయ్యాయంటూ వచ్చిన నివేదికను ఆర్‌బీఐ తిరస్కరించింది.
ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ఆర్‌బీఐకి సరఫరా చేయబడిన అన్ని నోట్లు సక్రమంగా లెక్కించబడతాయని రిజర్వు బ్యాంక్ శనివారం వెల్లడించింది. ప్రెస్‌లలో ముద్రించిన నోట్లను సరిదిద్దడానికి, వాటిని ఆర్‌బీఐకి సరఫరా చేయడానికి బలమైన వ్యవస్థలు ఉన్నాయని నొక్కి చెప్పింది. ఈ వ్యవస్థలలో "నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించడానికి కఠినమైన ప్రోటోకాల్‌లు" ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద వీటికి సంబంధించిన వివరాలను కోరారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.88,032.5 కోట్లు విలువైన రూ.500 నోట్లు మిస్ అయ్యాయంటూ ఆరోపించారు. దేశంలోని మూడు మింట్ లలో కొత్తగా రూపొందించిన రూ.500 నోట్లు 8,810.65 మిలియన్ నోట్లను ముద్రించగా.. వాటిలో కేవలం 7,260 మిలియన్ నోట్లను రిజర్వు బ్యాంక్ అందుకున్నట్లు RTI డేటా పేర్కొంది. మిగిలిన నోట్లు వ్యవస్థ నుంచి ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్నను మనోరంజన్ లేవనెత్తారు. ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ ఏప్రిల్ 2015-డిసెంబర్ 2016 మధ్య 375.450 మిలియన్ కొత్త నోట్లను ముద్రించినట్లు నివేదించబడింది. కానీ రిజర్వు బ్యాంక్ రికార్డుల ప్రకారం 345 మిలియన్ నోట్లను పొందినట్లు చూపుతున్నాయి. ఈ నోట్లు రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో RBIకి పంపిణీ చేయబడ్డాయి. కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో సంక్లిష్టమైన లాజిస్టికల్ సవాళ్లను పేర్కొంటూ RBI నుంచి కొంతమంది సీనియర్ అధికారులు అసమతుల్యతను సమర్థించినట్లు మింట్ కథనం నివేదించింది.
RTI అభ్యర్థనను దాఖలు చేయడంతో పాటుగా, కార్యకర్త మనోరంజన్ రాయ్ సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో(CEIB), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి రూ.500 నోట్లకు సంబంధించిన వ్యత్యాసం గురించి తెలియజేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications