RBI News: ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా చాలా మంది తమ డబ్బును సేఫ్టీ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పార్క్ చేస్తున్నారు. ఇదే సమయంలో రిజర్వు బ్యాంక్ FDలకు సంబంధించిన రూల్స్ మార్చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణలకు సంబంధించిన నియమ నిబంధనలను మార్చేసింది. ప్రస్తుతం బ్యాంకులు పెట్టుబడిదారులకు రూ.15 లక్షల వరకు ఎఫ్‌డిలపై ముందస్తు విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అంటే గడవు కంటే ముందు ఒకవేళ అవసరమైతే వాటిని విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.

అయితే నాన్-కాల్ మెచ్యూరిటీ విత్‌డ్రాయల్ పరిమితిని రిజర్వు బ్యాంక్ రూ.కోటికి పెంచింది. కొత్త రూప్స్ తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. అలాగే బ్యాంకులు మెచ్యూరిటీ వ్యవధి, డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి ముందస్తు ఉపసంహరణ సౌకర్యం లేకుండా కాల్ చేయని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ వడ్డీ రేట్లను ఆఫర్ చేయవచ్చు. ఈ నిబంధనలు NRE, NRP డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది. తాజా రిజర్వు బ్యాంక్ సర్క్యులర్ దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులకు వర్తిస్తుంది.
ముందుగా బ్యాంక్ ఎఫ్‌డి పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కాల్ చేసేందుకు వీలుండే డిపాజిట్లు, కాల్ చేసేందుకు వీలు ఉండని డిపాజిట్లు అనే రెండు రకాలు ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ డిపాజిట్ మరియు రుణ రేట్లను మరింతగా పెంచే అవకాశం ఉందని చెప్పిన వేళ దేశంలో అనేక మంది అధిక వడ్డీ రేట్లను పొందేందుకు తమ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు.
ICICI బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి ఆధారంగా FDపై 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. PNB ఏటా 7.75 శాతం వరకు FD రేట్లను అందిస్తుండగా.. SBI ఏడాదికి 7.50 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 7.75 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications