Credit Card Rules: దేశంలో ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, ఇతర రుణ సాధనాల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈక్రమంలో నిబంధనలను సైతం రిజర్వు బ్యాంక్ వినియోగారులకు సానుకూలంగా వారి ప్రయోజనాలను కాపాడే విధంగా సవరిస్తోంది. దేశంలోని ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి మార్పులు దీనినే సూచిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను మార్చడం ద్వారా కస్టమర్లకు గొప్ప ఉపశమనం కలిగించింది. క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఇప్పుడు వారి సౌలభ్యం ప్రకారం కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చుకునేందుకు వీలు కల్పించబడింది. ఇంతకుముందు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఒకసారి మాత్రమే దీన్ని చేయడానికి అవకాశం ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులను సెంట్రల్ బ్యాంక్ పూర్తిగా మార్చేసింది.

ఇందుకోసం ముందుగా గతంలో ఉన్న బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత క్రెడిట్ కార్డ్ కంపెనీని ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా బిల్లింగ్ సైకిల్‌లో మార్పుల కోసం అభ్యర్థించాలి. కొన్ని బ్యాంకుల్లో మీరు మెుబైల్ యాప్ ద్వారా కూడా ఈ మార్పులను చేసుకునేందుకు అవకాశాన్ని అందిస్తున్నాయి. కస్టమర్లు వారి ఆదాయ వనరులకు అనుగుణంగా బిల్లింగ్ తేదీలను మార్చుకోవచ్చు.
బిల్లింగ్ సైకిల్ అంటే ఏమిటి?
కస్టమర్ మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లు ప్రతి నెల 6వ తేదీన వస్తుంది. అటువంటి పరిస్థితిలో దాని బిల్లింగ్ సైకిల్ ఆ నెల 7వ తేదీ నుండి ప్రారంభమై వచ్చే నెల 6వ తేదీతో ముగుస్తుంది. ఈ 30 రోజుల వ్యవధిలో చేసిన అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తాయి. ఇది అన్ని కార్డ్ చెల్లింపులు, నగదు ఉపసంహరణలు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది. కార్డ్ రకం, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ ఆధారంగా ఈ బిల్లింగ్ వ్యవధి 27 రోజుల నుంచి 31 రోజుల వరకు ఉంటుంది. చాలా మంది కస్టమర్లు క్రెడిట్ కార్డు బిల్లు సైకిల్ తేదీ వల్ల చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల తాజా ఆర్బీఐ నిర్ణయం పెద్ద ఊరగటా వానికి నిలవనుందని తెలుస్తోంది.
క్రెడిట్ కార్డు వినియోగదారులు ముందుగా చేయాల్సింది బిల్లుల్లో కనీస బకాయి చెల్లింపు విధానాన్ని మానుకోవటం. అలా చేయటం వల్ల కార్డ్ అందించిన సంస్థ కస్టమర్ల నుంచి ప్రస్తుత బిల్లింగ్ సైకిల్‌లో బకాయి ఉన్న మొత్తంపై వడ్డీ వసూలు చేయడమే కాకుండా, తదుపరి బిల్లింగ్ సైకిల్స్‌లో చేసిన అన్ని ఇతర లావాదేవీలపై వడ్డీ రహిత వ్యవధి కూడా రద్దు చేయబడుతుంది. అంటే గడువు తేదీ తర్వాత చేసిన అన్ని లావాదేవీలు మొత్తం బకాయి మొత్తం పూర్తిగా తిరిగి చెల్లించబడే వరకు వడ్డీ పరిధిలోకి వస్తాయి. అందువల్ల ఎల్లప్పుడూ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో పూర్తిగా చెల్లించటం ఉత్తమం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications