NBFC: రెండు NBFCలపై RBI ఫైర్.. రిజిస్ట్రేషన్స్ రద్దు.. లైసెన్స్ సరెండర్ చేసిన HDFC!

NBFC: దేశంలోని ఆర్థిక సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుంది. నింబధనలు పాటించని, ఆర్థిక క్రమశిక్షణ లోపించిన వివిధ ఎంటిటీలను.. ఆంక్షలు, జరిమానాల ద్వారా దారిలో పెడుతుంటుంది. తాజాగా RBI రెండు ఆర్థిక సంస్థలపై కన్నెర్రజేసింది.

రెండు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFC) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్‌ను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. వాటిలో ఒకటి టుడేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాగా మరొకటి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ మేరకు RBI ఉత్తర్వులు జారీచేసింది.

RBI cancelled 4 NBFCs registration certificates and 2 housing finance companies surrender their licences

మరో ప్రత్యేక నోటిఫికేషన్‌లో.. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC)తో సహా 4 NBFCలు మరియు 2 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లైసెన్స్‌లను సరెండర్ చేసినట్లు కేంద్ర బ్యాంక్ తెలిపింది. ఫోర్డ్ క్రెడిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎకౌస్టిక్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, VSG ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సెంట్రమ్ మైక్రోక్రెడిట్ లిమిటెడ్ లు లైసెన్స్‌ను వదులుకున్నాయి.

తమ అనుబంధ బ్యాంక్‌లో HDFC విలీనం కావడంతో.. అది తన లైసెన్స్ సరెండర్ చేసింది. ఏప్రిల్ 4, 2022న రెండు సంస్థలూ ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. కాగా లైసెన్స్ సరెండర్ చేసిన మరో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ.. నేషనల్ ట్రస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా RBI పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+