RBI News: ఇటీవలి కాలంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని అనేక బ్యాంకుల లైసెన్సును రద్దు చేసింది. ఈ క్రమంలో అనేక సహకార బ్యాంకులు ప్రభావితం అయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా కేరళకు చెందిన అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్న RBI నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రూల్స్ ఏప్రిల్ 24, 2023న వ్యాపారం ముగిసినప్పటి నుంచి అమలులోకి వచ్చింది. అయితే బ్యాంకింగేతర సంస్థగా పనిచేయడానికి అనుమతించినట్లు రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని పలు సెక్షన్ల కింద అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు మంజూరు చేసిన జనవరి 3, 1987 నాటి బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. RBI ప్రకారం.. బ్యాంక్, NBFC మధ్య వ్యత్యాసం ఏమిటంటే, బ్యాంక్ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే ప్రభుత్వ-అధీకృత సంస్థ. NBFC అనేది బ్యాంక్ లైసెన్స్ లేకుండా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే సంస్థ. నాన్ బ్యాంకింగ్ కంపెనీలు ఎక్కువగా ప్రజలకు రుణ సేవలను అందిస్తుంటాయి.
ఇదే క్రమంలో వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. బాంబే మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.13 లక్షలు, తమిళనాడు స్టేట్ అపెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.16 లక్షలు, పూణేకు చెందిన జనతా సహకరి బ్యాంక్‌కు రూ.13 కోట్లు, బరన్ నగ్రిక్ సహకారి బ్యాంక్‌లపై జరిమానాలు విధించినట్లు ఆర్‌బీఐ సోమవారం ప్రకటించింది.
'డిపాజిట్‌లపై వడ్డీ రేటు'పై ఆదేశాలను పాటించనందుకు పూణేలోని జనతా సహకరి బ్యాంక్‌పై అత్యధిక జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీనికి ముందు 2022లో వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు 180కి పైగా బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ జరిమానా విధించింది. 2020లో ఆర్‌బీఐ 22 సహకార బ్యాంకులకు జరిమానా విధించగా.. 2021లో 124 బ్యాంకులకు జరిమానా విధించింది.


Click it and Unblock the Notifications