NBFC News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల స్పీడ్ పెంచింది. వినియోగదారుల ప్రయోజనా ర్థం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో ఫిన్‌టెక్ సహా పలు ఆర్థిక సంస్థల వెన్నులో వణుకు పుడుతోంది. మొన్నటికి మొ న్న పేటీఎంపై విరుచుకు పడింది. ఇటీవల IIFLపై ఆంక్షలు విధించింది. నిబంధనలు పాటించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమనే సంకేతాలను బలంగా వినిపించింది.
ఇదిలా ఉండగా మరోసారి ఏకంగా 7 ఫైనాన్స్ కంపెనీల రిజిస్ట్రేషన్స్ రద్దు చేస్తూ RBI కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది పేటీఎం, IIFL తరహాలోని క్రమశిక్షణా చర్యల్లో భాగం కాకపోవడం గమనార్హం. ఆయా కారణాల రీత్యా ఈ సంస్థలు తమ లైసెన్సును RBI వద్ద సరెండర్ చేశాయి. తమ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు గతంలో వాటికి RBI ఇచ్చిన లైసెన్సును ఇప్పుడు తానే క్యాన్సిల్ చేసింది.

ఈ 7 సంస్థల్లో L&YTకి సంబంధించినవే రెండు ఉన్నాయి. L&T ఫైనాన్స్, L&T ఇన్‌ఫ్రా క్రెడిట్ లను LTFHలో విలీనం చేస్తున్నట్లు ఇటీవల L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ ప్రకటించింది. కాగా ఇప్పుడు ఈ విషయంలో ముందడుగు పడింది. ఇవికాక జిన్వానీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, శ్రుతి ఫైనాన్షియల్ సర్వీసెస్, క్రియేటివ్ ఇన్ ఫ్రా, మంజుశ్రీ ఫిన్‌క్యాప్ మరియు మరుధర్ ఫుడ్ అండ్ క్రెడిట్ ఈ లిస్టులో ఉన్నాయి.
తాజా RBI చర్యతో ఈ 7 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(NBFC)లు ఇకపై కనిపించవు. వీటితో పాటు మరో 4 ఫైనాన్స్ సంస్థలు సుయాష్ ఫినోవెస్ట్, నిమిషా ఫైనాన్స్ ఇండియా, కామధర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్, ఆర్ఎంబీ ఫైనాన్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా రద్దు చేసినట్లు RBI ఓ ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications