UDGAM Portal: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను ట్రాక్ చేసుకునేందుకు రిజర్వు బ్యాంక్ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రీకృత వెబ్ పోర్టల్ UDGAMను ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఈ పోర్టల్ ద్వారా ప్రస్తుతం కస్టమర్లు SBI, PNB, సౌత్ ఇండియన్ బ్యాంక్, సిటీ బ్యాంక్‌తో సహా ఏడు బ్యాంకుల నుంచి మాత్రమే తమ అన్‌క్లెయిమ్ డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగలరు. క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యలో పెరుగుతున్న ట్రెండ్ దృష్ట్యా ప్రజలకు ఆర్బీఐ అవగాహన కల్పిస్తూనే ఉంది. వెబ్ పోర్టల్ ప్రారంభం వారి అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లు/ఖాతాలను గుర్తించడంలో వినియోగదారులకు సహాయం చేస్తుంది.

పోర్టల్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, DBS బ్యాంక్ ఇండియా, సిటీ బ్యాంక్ వివరాలను ప్రజలు పోర్టల్ ద్వారా పొందగలరని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. పోర్టల్‌లో మిగిలిన బ్యాంకుల కోసం శోధించే సదుపాయం అక్టోబర్ 15, 2023 నాటికి దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలియజేసింది. అన్‌క్లెయిమ్ డిపాజిట్లను ఎలా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..
Step 1: ముందుగా UDGAM పోర్టల్ కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి: https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login
Step 2: లాగిన్ కానట్లయితే, మీరు మొదట పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్, పూర్తి పేరు వంటి వివరాలను అందించాలి. ఆపై పాస్‌వర్డ్‌ను సెట్ చేసి, బోల్డ్ ఫార్మాట్‌లో పేర్కొన్న క్యాప్చా కోడ్‌ను ఫిల్ చేయాలి. చివరగా నిబంధనలు, షరతులు అంగీకరించి తరువాతి స్టెప్‌కి వెళ్లాలి.
Step 3: ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత.. మీరు పోర్టల్‌కి లాగిన్ చేయవచ్చు.
Step 4: లాగిన్ చేయడానికి ముందుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి నెక్స్‌స్ట్ క్లిక్ చేయండి.
Step 5: ఇది మీ మొబైల్ నంబర్‌కు పంపబడే వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) కోసం అడిగే పేజీకి రీరూట్ చేస్తుంది.
Step 6: OTPని నమోదు చేసిన తర్వాత ఖాతాదారుడి వివరాలను, బ్యాంక్ పేరును ఫిల్ చేయాల్సిన మరొక పేజీకి మళ్లించబడతారు. అక్కడ పాన్ నంబర్, ఓటర్ ఐడి, పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి ఐదు వివరాల్లో దేనినైనా నమోదు చేయాల్సి ఉంటుంది.
Step 7: పై ప్రక్రియలు పూర్తైన తర్వాత చివరగా.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏవైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు స్కీన్ పై చూపబడతాయి. క్లెయిమ్ చేయని డిపాజిట్లు లేకుంటే అక్కడ ఎలాంటి వివరాలు డిస్ప్లై కావు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications