మీరు ఏటీఎం నుండి రూ.100 లేదా 200 నోట్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారా.. అయితే ఈ సమస్యకు త్వరలో చెక్ పడనుంది. ఎందుకంటే ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కస్టమర్లు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ATMలలో వీలైనన్ని ఎక్కువగా రూ.100 ఇంకా రూ.200 నోట్లను ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను కోరింది.

ప్రస్తుతం, ఎక్కువగా ATM ల నుండి 500 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో 100 లేదా 200 రూపాయల నోట్లు అవసరమైన వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకు ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ కోరుకుంది. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులు అలాగే వైట్-లేబుల్ ATM ఆపరేటర్లకు అవసరమైన సూచనలను ఇచ్చింది. అంతేకాదు దీనికి రిజర్వ్ బ్యాంక్ కొంత గడువు కూడా నిర్ణయించింది.
రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే : ఈ నోట్లు 30 సెప్టెంబర్ 2025 నాటికి 75% ATMలలో కనీసం ఒక క్యాసెట్‌లో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. అంటే, ఈ నోట్లు చాలా ATMలలో ఇక అందుబాటులో రానున్నాయి. అలాగే 31 మార్చి 2026 నాటికి ఇవి 90% ATMలలో అందుబాటులో ఉండాలి. దింతో ప్రజలు చిన్న నోట్ల గురించి లేదా పెద్ద నోట్ల చిల్లర కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
మే 1 నుండి మారనున్న ఎటిఎం విత్ డ్రా రూల్స్: మీరు ATM నుండి ఎక్కువగా డబ్బు తీస్తే, ఈ అలవాటు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మే 1 నుండి ATM నుండి క్యాష్ విత్ డ్రా నిబంధనలలో మార్పులు జరగబోతున్నాయి. దింతో మరికొద్దిరోజుల్లో మీరు ATM నుండి నగదు పరిమితికి మించి తీస్తే మీ పాకెట్ పై అధిక చార్జీల మోత పడుతుంది.
ప్రతి బ్యాంకు కొన్ని ఫ్రీ లిమిట్స్ నిర్ణయించింది. మీరు ఏటీఎం నుండి ఫ్రీ లిమిట్ కంటే ఎక్కువసార్లు డబ్బు తీసుకుంటే మీరు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దింతో మే 1 తర్వాత ఫ్రీ లిమిట్ దాటితే ప్రతి ATM ట్రాన్సక్షన్ పై రూ. 23 చార్జెస్ వసూలు చేయనున్నాయి. ప్రస్తుతం ఈ చార్జెస్ రూ. 21 ఉంది. అయితే తక్కువ విలువ ఉన్న నోట్లను ఎక్కువగా అందుబాటులోకి తెస్తే పెద్ద విలువ ఉన్న నోట్ల కొరత ఏర్పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications