For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త క్యూఆర్ కోడ్‌లపై ఆర్బీఐ నిషేధం, 2022 మార్చి 31 వరకు గడువు

|

పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్(PSOs) పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కోసం కొత్తగా క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిషేధం విధించింది. ప్రస్తుతం రెండు క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. వినియోగంలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్స్‌నే కొనసాగించాల్సి ఉంటుందని వెల్లడించింది. సొంత క్యూఆర్ కోడ్స్ ఉపయోగించే పీఎస్ఓలు కూడా ఈ రెండింటికి మారవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ 2022 మార్చి 31వ తేదీ నాటికి పూర్తి కావాలని ఆర్బీఐ పేర్కొంది.

క్యూఆర్ కోడ్స్ రెండు డైమెన్షనల్ మిషిన్, రీడబుల్ బార్‌కోడ్స్ ఉంటాయి. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మొబైల్ చెల్లింపులు సులభతరం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడ్స్ పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వచేయగలవు. దేశంలో ఇలాంటి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ వ్యవస్థను సమీక్షించేందుకు, వివిధ సూచనలు చేసేందుకు ఆర్బీఐ దీపక్ పాటక్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం ఉన్న రెండు క్యూఆర్ కోడ్స్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఉల్లి ధరలు భగ్గు, రెండ్రోజుల్లో రూ.60 జంప్: కేంద్రం కీలక నిర్ణయంఉల్లి ధరలు భగ్గు, రెండ్రోజుల్లో రూ.60 జంప్: కేంద్రం కీలక నిర్ణయం

RBI bans issuing new proprietary QR codes by payment system operators

యూపీఐ క్యూఆర్ కోడ్, భారత్ క్యూఆర్ కోడ్స్ కొనసాగుతాయని కేంద్ర బ్యాంకు ఓ నోటిఫికేషన్లో తెలిపింది. జపాన్‌కు చెందిన డెన్సో వేవ్ సంస్థ 1990లలో క్యూఆర్ కోడ్స్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశీయంగా క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్స్ ప్రధానంగా భారత్ క్యూఆర్, యూపీఐ క్యూఆర్‌తో పాటు సంస్థల సొంత క్యూఆర్‌లను సపోర్ట్ చేస్తున్నాయి.

English summary

కొత్త క్యూఆర్ కోడ్‌లపై ఆర్బీఐ నిషేధం, 2022 మార్చి 31 వరకు గడువు | RBI bans issuing new proprietary QR codes by payment system operators

The Reserve Bank on Thursday barred Payment System Operators (PSOs) from launching any new proprietary QR code for payment transactions.
Story first published: Friday, October 23, 2020, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X