Jio Financial: ఆయిల్ నుంటి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లోకి విస్తరించిన ముఖేష్ అంబానీ రిలయన్స్ మరిన్ని కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల జియో ఫైనాన్షియల్ సంస్థను ప్రత్యేక కంపెనీగా విడదీసిన సంగతి తెలిసిందే.
అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్లుగా ఇషా అంబానీ, అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాల నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ వ్యాపారాన్ని సైతం అంబానీ కుమార్తె ఇషా చేతిలో పెట్టడం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. రిలయన్స్ రిటైల్ మాదిరిగానే ఫైనాన్స్ వ్యాపారాన్ని సైతం ఆమె వేగంగా వృద్ధి చేయగలరని వారు బలంగా నమ్ముతున్నారు. అయితే ఆమోదం రానున్న 6 నెలల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది.

ఇషా అంబానీ యేల్ యూనివర్శిటీ నుంచి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో డబుల్ మేజర్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అలాగే రిలయన్స్ రిటైల్‌లో ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లో భాగం. 2016లో భారతదేశంలో జియోను కాన్సెప్ట్‌వలైజ్ చేసి లాంచ్ చేయటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నేడు మార్కెట్లు ముగిసే సమయంలో జియో ఫైనాన్షియల్ కంపెనీ షేర్ ధర 1.23 శాతం పెరిగి బీఎస్ఈలో రూ.227 వద్ద ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.42 లక్షల కోట్లుగా ఉంది.
ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వర్టికల్‌ను కొత్త కేటగిరీలు, ఫార్మాట్‌లలోకి విస్తరించడానికి నాయకత్వం వహిస్తున్నారు. ఫుడ్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ రిటైల్‌లో కంపెనీ తన ఉనికిని కలిగి ఉంది. రీచ్, స్కేల్, రాబడి ద్వారా ఇది అతిపెద్ద రిటైల్ సంస్థగా దేశంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ మరియు ఐఐఎం-అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశారు. ఠాకూర్‌కు కార్పొరేట్ వ్యూహం,పెట్టుబడి బ్యాంకింగ్‌లో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.
అలాగే హితేష్ సేథియా ఒక చార్టర్డ్ అకౌంటెంట్. పైగా అతడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి. అతను ఐరోపా, ఆసియా (భారతదేశం & గ్రేటర్ చైనా, ఉత్తర అమెరికా అంతటా 2 దశాబ్దాల అనుభవంతో ఆర్థిక సేవల కార్యనిర్వాహకుడిగా పనిచేశారు. పైగా ICICI బ్యాంక్ కెనడా, ICICI బ్యాంక్ జర్మనీ, UK, హాంకాంగ్‌లో ICICI బ్యాంక్ కార్యకలాపాల్లో పనిచేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications