భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2018-19 సిరీస్ 6 (SGB 2018-19 సిరీస్ VI - ఇష్యూ తేదీ ఫిబ్రవరి 12, 2019)ని 12 ఫిబ్రవరి 2019న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కు సంబంధించి ఆర్బీఐ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను ప్రకటించింది. ఈ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ రిడెంప్షన్ గ్రాము ధర రూ.6927 గా నిర్ణయించారు. ఈ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు గ్రాము ధర రూ.3326 చొప్పున గోల్డ్ బాండ్‌ను కొనుగోలు చేశారు. అంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై 108 శాతం రాబడిని పొందుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్‌ను జారీ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ఎంపిక అందుబాటులో ఉంటుంది. ఈ శ్రేణికి చెందిన సావరిన్ గోల్డ్ బాండ్ ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ సోమవారం 12 ఆగస్టు 2024న జరగనుంది. రిడెంప్షన్ తేదీకి ముందు వారంలోని చివరి మూడు ట్రేడింగ్ సెషన్‌లలో బుధవారం నుంచి శుక్రవారం మధ్య 999 స్వచ్ఛత కలిగిన బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా సావరిన్ గోల్డ్ బాండ్ రిడెంప్షన్ ధర నిర్ణయించారు.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రకారం ఆగస్టు 12, 2024న 2018-19 సిరీస్ 6 సావరిన్ గోల్డ్ బాండ్ రిడెంప్షన్ ధర గ్రాముకు రూ. 6927గా నిర్ణయించారు. ఇది ఆగస్టు 7 నుంచి ఆగస్టు వరకు మూడు రోజులలో బంగారం ముగింపు సగటు ధర అని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జూలై 23, 2024న సమర్పించిన బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు, దీని కారణంగా బంగారం ధరలు తగ్గాయి.
దీని వల్ల సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు వచ్చే రాబడులు తగ్గాయి. గత వారం కూడా, RBI సావరిన్ గోల్డ్ బాండ్ 2016-17 సిరీస్ I (SGB 2016 -17 సిరీస్ I) రిడెంప్షన్ గ్రాముకు రూ. 6938గా ప్రకటించింది. అయితే భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications